దేవయానికి వార్నింగ్ ఇచ్చిన జగతి.. పాండియన్ ఇంటికి రిషి!
on Sep 22, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -874 లో.. రిషి ఏంజిల్ ఇంటినుండి బయటకు వెళ్లిపోతాడు. అసలు రిషి సర్ ఎక్కడికి వెళ్తున్నాడని వసు ఫోన్ చేస్తుంది. వసుధార ఫోన్ చేస్తుంటే కట్ చేస్తాడు రిషి. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారు సర్ అని వాయిస్ మెసేజ్ పెడుతుంది వసుధార. ఆ తర్వాత ఫోన్ చేసి ఎక్కడికి వెళ్తున్నారని వసుధార అడిగితే రిషి చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తాడు.
ఆ తర్వాత పాండియన్ కి వసుధార ఫోన్ చేస్తుంది. రిషి హోటల్ లో ఉండడానికి వెళ్తాడు కానీ రిషి వెళ్లేసరికి పాండియన్ అక్కడ ఉంటాడు. సర్ నాతో పాటు రండి అని అనగానే నేను పీస్ అఫ్ మైండ్ కోసం వచ్చానని రిషి అనగానే.. నాతో పాటు రండి మీకు కావలిసిన పీస్ అఫ్ మైండ్ ఉంటుందని రిషిని తీసుకొని వెళ్తాడు పాండియన్. మరొక వైపు దేవయాని, శైలేంద్ర ఇద్దరు రిషి గురించి మాట్లాడుకుంటారు. రిషిని ఎలాగైనా వేసేయాలి. ఎప్పుడు మనకి అడ్డు పడుతునే ఉన్నాడని శైలేంద్ర అనగానే.. అది మీ వల్ల కాదంటూ జగతి వస్తుంది. రిషి దగ్గరికి వెళ్ళాలి అంటే మమల్ని దాటుకొని వెళ్ళాలని జగతి అంటుంది. ఇవ్వాన్ని ఎందుకు సింపుల్ గా శైలేంద్రని కాలేజీ ఎండీ చేస్తే సరిపోతుంది కదా వాడి ముచ్చట తీరుతుంది కదా అని దేవయాని అంటుంది. రిషి కాలేజీ నీ వేరేవాళ్లకి కట్టబెట్టాలా? సమస్య వచిన్నపుడు రిషి ఖచ్చితంగా వస్తాడు. ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలకి జగతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. మరొక వైపు రిషిని తీసుకొని పాండియన్ తన ఇంటికి వస్తాడు. మురుగన్ రిషికి వెల్ కమ్ చెప్తాడు. అయిన నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావని పాండియన్ ని రిషి అడుగుతాడు. మీరు ఇక్కడ మీకు నచ్చినట్టు ఉండొచ్చు. మీ ప్రైవసీ కి ఎవరు అడ్డు రారని మురుగన్, పాండియన్ ఇద్దరు కలిసి రిషిని వాళ్ళింట్లో ఉండడానికి ఒప్పిస్తారు.
ఆ తర్వాత రిషికి తన గదిని చూపిస్తారు. ఆ గది అంత కూడా రిషికి నచ్చేలా ఉంటుంది. ఎవరు ఇలా చేశారని రిషి అడుగుతాడు. వసుధార చేసిందని మురుగన్ చెప్తాడు. నేను ఎక్కడకి వెళ్లిన నా గురించి ఆలోచిస్తావ్ వసుధార అని తన ప్రేమని గుర్తు చేసుకుంటాడు రిషి. మరొక వైపు రిషి ఇంటికి వచ్చేలా ఏదైనా పూజ చేయించాలని దేవాయని పూజారిని పిలుస్తుంది. అదంతా నటన అని జగతి మహేంద్రలకు తెలుసు. కావాలనే ఫణింద్ర ముందు రిషి పై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతుంది దేవయాని. అదంతా అవసరం లేదని పూజారిని పంపిస్తాడు ఫణీంద్ర. ఆ తర్వాత రిషి గురించి తనకి చెప్పకుండా దాచినందుకు ఫణింద్ర బాధపడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
