పక్కా ఆధారాలతో రిషిని ఇరికించిన శైలేంద్ర.. కీలుబొమ్మగా మారిన జగతి!
on May 24, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు.. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-770 లో.. వసుధారని చెక్ పవర్ ని దుర్వినియోగం చేసావని శైలేంద్ర అంటాడు. నాకేం అవసరం.. అయినా నేనెందుకు అలా చేస్తాను. రిషి సర్ ఏ తప్పు చేయలేదని వసుధార అంటుంది.
మినిస్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాక మాట్లాడుకుందామని జగతి అనగా.. నువ్వు అయినా వసుధారకి చెప్పు పిన్ని.. మనమిద్దరం వెళ్ళి కనుక్కొని వద్దామని అని శైలేంద్ర అంటాడు. దాంతో వసుధారని ఆపుతుంది జగతి. శైలేంద్ర, జగతి కలిసి మినిస్టర్ దగ్గరికి బయల్దేరతారు. అలా వెళ్తుండగా జగతిని ఎమోషనల్ గా బెదిరిస్తాడు శైలేంద్ర. మినిస్టర్ దగ్గర ఎక్కువగా మాట్లాడితే రిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.. నేను చెప్పినట్లు చెప్పమని శైలేంద్ర అంటాడు. దానికి నేను అలా చేయనని జగతి అంటుంది. ఆ తర్వాత ఇద్దరు మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. రిషి మీద చెక్ పవర్ ని దుర్వినియోగం చేసాడనే అభియోగం మోపబడింది.. మీరేమంటారని మినిస్టర్ అనగా.. మా రిషి అలా చేయడు.. వాడే ఫ్రాడ్ చేసాడని సారథిని కావాలనే తిట్టినట్టుగా యాక్ట్ చేస్తాడు శైలేంద్ర.
నేనెందుకు అలా చేస్తాను.. నాకేం అవసరం.. మెడికల్ కాలేజీ వర్క్ గురించి ఈ చెక్ రిషి నాకిచ్చాడు.. ఆధారాలు పక్కాగా ఉన్నాయి కదా అని సారథి అంటాడు. అది విని ఏంట్రా నువ్వు చెప్పేది.. నేను వినేదని సారథి కాలర్ పట్టుకుంటాడు శైలేంద్ర.. కూల్ శైలేంద్ర ఎందుకు ఇంత కోపం.. ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కదా ఏది నమ్మాలో తెలియడం లేదు.. జగతి మేడం మీరు చెప్పండని మినిస్టర్ అంటాడు. చెక్ పవర్ ఎవరికి ఉందో వారిని నిలదీయాలని, నేరం చేసినవారికి శిక్ష పడాలని జగతి అంటుంది. ఆ తర్వాత అందరూ ఇంటికి వచ్చేస్తారు. రాత్రి అందరూ పడుకున్నాక రిషి గది దగ్గరికి వచ్చి.. రిషిని చూస్తూ బాధపడుతుంది. కాసేపటికి రిషి లేచి చూస్తాడు. మీరేంటి మేడమ్ ఇక్కడ అని జగతిని రిషి అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



