Home

»

Tv News

జబర్దస్త్ టైమింగ్స్ చేంజ్ ...రంగంలోకి దిగిన ఆది

Jul 21, 2026 11:52AM

జబర్దస్త్ అంటే ఒకప్పుడు ప్రతీ ఇంట్లోని వాళ్ళు  ఒక దగ్గర కూర్చుని కమెడియన్స్ వేసే పంచులు తెగ నవ్వుకునే వాళ్ళు. ప్రతీ ఒక్కరూ వారానికి ఒక రోజు ఈ కామెడీ షో చూసి ఛిల్ల్ అయ్యేవాళ్ళు. మొదట్లో ఈ షో ప్రతీ గురువారం రాత్రి ప్రసారం అయ్యేది. ఆ తర్వాత ఈ షోకి ఆడియన్స్ పెరగడం రేటింగ్ పెరిగే సరికి ఎక్స్ట్రా జబర్దస్త్ పేరుతో ఇంకో షోని లాంచ్ చేశారు. అలా జబర్దస్త్,  ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ ప్రతీ శుక్ర, శనివారల్లోకి ఈ షోస్ ని  మార్చేశారు.

ఇక ఇప్పుడు ఈ షోని వీకెండ్ సుండేకి మార్చేశారు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి ప్రతీ ఆదివారం రాత్రి 6 గంటలకు ఈ షో టెలికాస్ట్ కాబోతోంది  అది కూడా 26 నుంచి. మొదట్లో రోజా, నాగబాబు జోడిగా వచ్చిన జడ్జెస్ కూడా ఈ షోని వాళ్ళ నవ్వులతో, కామెంట్స్ తో అప్పుడప్పుడు సీరియస్ గా ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తో సరదాగా సాగేది. నాగబాబు పగలబడి నవ్వితే ఆ స్కిట్ విన్ ఐనట్టు అనుకునేలా చేశారు. ఇక తర్వాత రోజా పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. నాగబాబు కూడా షో నుంచి కొన్నేళ్లు దూరంగా ఉన్నారు. అలాగే కమెడియన్స్ వెళ్లిపోయారు. హోస్ట్ కూడా రష్మీ ఉన్నా కొత్త వాళ్ళు వచ్చి ఎక్కువ కాలం నిలబడలేకపోయారు.

ఇక ఇప్పుడు జబర్దస్త్ ని మళ్ళీ నిలబెట్టేందుకు నాగబాబు రీఎంట్రీ ఇచ్చారు. ఐతే రోజా ప్లేస్ లో ఇంద్రజ వచ్చారు. ఇక ఇప్పుడు షో వీకెండ్ లోకి తీసుకెళ్లారు. ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన స్పెషల్ ప్రోమోలో ఇంద్రజ డైలాగ్ మాములుగా లేదు. "13 ఏళ్ళు ఒక లెక్క ఇక ముందు మరో లెక్క " అంటూ చెప్పారు. ఇక అజర్ లేచి "జబర్దస్త్ అంటే టైం మారుతోంది వీక్ మారుతోంది ఒకే నా అండి " అంటూ ఆదిని అడిగాడు. వెంటనే ఆది కూడా పంచ్ వేసాడు. "వీక్ మారినంత మాత్రాన జబర్దస్త్ వీకైపోదు. టైం మారినంత మాత్రమే జబర్దస్త్ టైమింగ్ పోదు. జబర్దస్త్ జబర్దస్తే ఎప్పుడూ  " అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు ఆది ఎంట్రీ ఇచ్చాడు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com