
డ్రామా జూనియర్స్ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో చిన్నారులు చేసిన స్కిట్స్ కి శ్రీకాంత్, అనిల్ రావిపూడి, రోజా పగలబడి నవ్వుకున్నారు. ఇక సుధీర్ ఎప్పటినుంచో అనిల్ రావిపూడిని ఒక క్యారెక్టర్ ఇవ్వండి అని అడుగుతూనే ఉన్నాడు. సంక్రాంతి వస్తోంది అంటే చిన్న పెద్దా హీరోస్ అంతా అనిల్ రావిపూడి చూస్తూనే తిరుగుతున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో హీరోగా అంతకు మించి వాళ్ళను కొత్త కోణంలో చూపిస్తూండేసరికి అందరూ అవకాశం ఇవ్వండి అంటూ అనిల్ ని అడుగుతూనే ఉన్నారు.
రీసెంట్ గా లెనిన్ తో హిట్ కొట్టిన అఖిల్ అక్కినేని కూడా త్వరలో సంక్రాంతికి మనం కలిసి చేస్తున్నాం అంటూ మంచి ఆఫర్ కూడా ఇచ్చేసారు. ఇక ఆఫర్ కోసం అనిల్ రావిపూడి మూవీలో నటించడానికి సుధీర్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తూనే ఉన్నాడు. రీసెంట్ ప్రోమోలో కూడా అదే విషయాన్నీ అడిగాడు. అనిల్ రావిపూడి వెర్సెస్ సుధీర్ టాస్క్ ఒకటి నడిచింది. యానిమల్ 1 X 1 అంటూ ఇద్దరూ చేతులు పట్టుకున్న పిక్ చూస్తే చాలు విషయం అర్ధమవుతుంది.
"అది సినిమాలో ఛాన్స్ ఏదన్న " అంటూ సుధీర్ అనిల్ ముందు నసుగుతూ ఉన్నాడు. "చూద్దాం చూద్దాం " అన్నారు అనిల్. "సర్ ఫ్రెండ్ క్యారెక్టర్ లాంటిది ఏదన్నా సరే " అన్నాడు మళ్ళీ నసుగుతూ. ఇక అనిల్ కి కోపం వచ్చేసింది సుధీర్ జాకెట్ పట్టుకుని సీరియస్ గా "ఎన్నిసార్లు చెప్పాలిరా. ఫ్రెండ్ క్యారెక్టర్ లు చేసి హీరో అయ్యావు మళ్ళీ హీరో నుంచి ఫ్రెండ్ కి వస్తావా. నువ్వు హీరో " అంటూ మంచి ఎమోషనల్ డైలాగ్ చెప్పారు.
ఇక ఆ డైలాగ్ కి సుధీర్ మెల్ట్ ఐపోయి మోకాళ్ళ మీద నిలబడి "సారూ మీవే నా కలలన్నీ నెరవేర్చాలి సారూ " అంటూ లేచి అనిల్ భుజం మీద పడుకున్నాడు సుధీర్. కాసేపటికి ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. తర్వాత అనిల్, సుధీర్ పొజిషన్స్ చేంజ్ చేసుకున్నారు. సుధీర్ అనిల్ లా, అనిల్ సుధీర్ లా చేశారు. "సర్ సర్ ఒక్క వేషం. ఫ్రెండ్ క్యారెక్టర్ ఐనా పర్లేదు సర్ " అంటూ అనిల్ సుధీర్ వెంట పడ్డారు. వెంటనే సుధీర్ సీరియస్ గా "ఏయ్ నీకు ఎన్ని సార్లు చెప్పాలి " అంటూ అనిల్ జాకెట్ ని పట్టుకుని తిట్టేసారు. చూస్తున్నవాళ్లంతా అవాక్కయ్యారు.




.webp)

