
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -326 లో..... రుద్ర, గంగ కలిసి చేస్తారు. వాళ్ళిద్దరూ ఉండకుడదనే కుట్రతో వీరు రౌడీలతో కలిసి బాంబ్ పెట్టిస్తాడు. ఆ బాంబ్ ఒక మూటలో పెడుతారు. ఆ మూటని కోతి పక్కకి తీసుకొని వెళ్తుంది. అది ఇషిక, వీరు చూసి టెన్షన్ పడుతారు. రుద్ర, గంగ హోమం పూర్తి అవుతుంది. మా గంగ, రుద్ర జాతకాలు ఇచ్చాను వాళ్ళ జాతకలు ఎలా ఉన్నాయని పెద్దసారు అడుగుతాడు.
బాగున్నాయ్ చిన్న చిన్న దోషాలు ఉన్నాయి కానీ అవి ఈ హోమం వల్ల తొలగిపోతాయని పంతులు చెప్తాడు. మరొకవైపు ప్లాన్ ఫెయిల్ అయిందని ఇషిక, వీరు డిస్సపాయింట్ అవుతారు. మరొకవైపు రౌడీలున్న దగ్గరికి కోతి మూట తీసుకొని వచ్చి పడేస్తుంది. దాంతో బాంబ్ పేలుతుంది. మరొకవైపు అందరు ఇంటికి వెళ్తారు. హోమం దగ్గర నుంచి తెచ్చిన బొట్టుని పెద్దసారుకి శకుంతల పెడుతుంది. భాను ఫోటో చూస్తూ శకుంతల ఎమోషనల్ అవుతుంది. నీ కళ్ళని ఏడిపించానని శకుంతల బాధపడుతుంది. ఒకసారి మార్ట్ కి వెళ్లి కార్తీక్ ని చూడాలని శకుంతల అనుకుంటుంది. మరొకవైపు పెద్దసారు కూడా కార్తీక్ ని చూడాలని అనుకొని రుద్రకి చెప్తాడు. సరే కార్తీక్ దగ్గరికి వెళదామని రుద్ర అంటాడు.
శకుంతల బయటకు వెళ్తుంటే ఎక్కడికి అని పెద్దసారు అడుగుతాడు. గుడికి అని శకుంతల అబద్ధం చెప్తుంది. సరే నేను వస్తానని పెద్ద సారు అంటాడు వద్దు అని శకుంతల ఒకతే వెళ్తుంది. మరొకవైపు కార్తీక్ మార్ట్ కి వచ్చి తన పని తను చేసుకుంటాడు. ప్రమీల తనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






