Home

»

Tv News

కూతురు క్యాతికమ్మకు చెవులు కుట్టించిన జబర్దస్త్ రాకేష్, సుజాత క్యూట్ మూమెంట్స్ వైరల్

Nov 13, 2026 8:35AM

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాకేష్ ఒకరు. తన కామెడీతో ఆడియన్స్ ని తన వైపు తిప్పుకుంటాడు.  అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటాడు.   ముఖ్యంగా భార్య సుజాత, కూతురు క్యాతికమ్మతో కలిసి సోషల్ మీడియాలో పంచుకునే వీడియోలు, ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా రాకేష్, సుజాత దంపతులు తమ కూతురు క్యాతికమ్మకు చెవులు కుట్టించారు. ఈ వేడుకకు సంబంధించి వీడియోస్ ని పిక్స్ ని తమ ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు.   చిన్నారి క్యాతికమ్మకు చెవులు కుట్టించే సమయంలో తీసిన ముచ్చటైన క్షణాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

చిన్నారికి చెవులు కుట్టించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్యాతికమ్మకు సంబంధించిన ఈ అప్‌డేట్ చూసిన అభిమానులు కూడా మురిసిపోతున్నారు. చిన్నారి ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ, సంతోషంగా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు. రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత 2023 ఫిబ్రవరి 24న తిరుమలలో పెళ్లి చేసుకున్నారు .  వీరికి 2024లో పాప  ఖ్యాతిక పుట్టింది .   ఇక రాకేష్ సినిమాల విషయానికి వస్తే.. నటుడిగా కొన్ని మూవీస్ లో కనిపించాడు.   '24 కిస్సెస్' , 'సచ్చింది రా గొర్రె'  , 'లాక్‌డౌన్' , 'డ్రీమ్ బాయ్' , 'పార్క్' , 'మాధవే మధుసూదన' , 'కేసీఆర్' , 'గ్యాంబ్లర్స్'  వంటి సినిమాల్లో నటించారు. 2024లో విడుదలైన 'కేసీఆర్' (కేశవ చంద్ర రమావత్) సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా కూడా అరంగేట్రం చేశారు. మరోవైపు జోర్దార్ సుజాత నటిగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'సేవ్ ది టైగర్స్' సిరీస్‌కు ఓటీటీలో మంచి స్పందన వచ్చింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com