Home

»

Tv News

Brahmamudi:  రేఖ రూమ్ ని అపర్ణ- సుభాష్ లకి ఇచ్చిన రాజు!

Nov 13, 2026 8:22AM

స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 1187 లో.... సుభాష్ ఇంటికి వచ్చిన తన ఫ్రెండ్ నరేంద్రతో ఎమోషనల్ అవుతూ బాధపడటం చాటు నుంచి చూసిన రాజు బాధపడతాడు. ఎలాగైనా సుభాష్ వాళ్ల జీవితాలు మార్చాలని అనుకుంటాడు. వెంటనే హాల్లోకి వెళ్లి అందరిని పిలుస్తాడు. అందరూ వస్తారు. ఏంటి అల్లుడు ఎప్పుడూ ఐశ్వర్య పిలిచేది ఇవాళ నువ్వు పిలుస్తున్నావని శేషు అడిగితే, ఈ ఇంట్లో సామాజిక న్యాయం చేయాలని పిలిచానని రాజు అంటాడు. న్యాయమా ఏంటదని భ్రమరాంబ అడిగితే, దుగ్గిరాల ఇంటి కోసం ఫోటోలో ఉన్న తాతగారు ఎంతో కృషి చేస్తే, ఆ తర్వాత ఈ ఇంటిని ఈ స్థాయికి తీసుకొచ్చింది ఈ తాతయ్య, 40 ఏళ్లుగా ఎంతో కష్టపడి ఈ కుటుంబాన్ని ఎత్తులో కూర్చోబెడితే ఆయనను అనామకుడిగా ఆ రూంలో ఉంచడం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఇక నుంచి ఈ ఇంట్లో ఉన్న మాస్టర్ బెడ్ రూంలో వాళ్లు ఉంటారని రాజు చెప్తాడు. అందరు షాక్ అవుతారు. మరి ఆ బెడ్ రూంలో ఉన్న వాళ్లు ఎక్కడికి వెళ్లాలని భ్రమరాంబ అడిగితే, కరెక్టుగా అడిగావు అత్తా.. ఇన్నాళ్లు తాతయ్య, అమ్మమ్మ ఉన్న రూంలో ఉంటారని చెప్తాడు. అక్కడ ఉండకపోతే ఏంటి అల్లుడు అని శేషు అడిగితే ఉండకపోతే బయటకు వెళ్లిపోవచ్చని రాజు అంటాడు. కట్ చేస్తే రేఖ, భూషణ్ రూం ఖాళీ చేసి బయటకు వస్తుంటారు. అప్పుడే అపర్ణ, సుభాష్ రూంలోకి ఎంట్రీ ఇస్తుంటారు. అది చూసిన రాజు విజిల్ వేస్తూ ఆహా ఈ సీన్ చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో అంటాడు.

రూంలోకి వెళ్లిన తర్వాత అపర్ణ, సుభాష్ చాలా హ్యాపీగా ఫీలవుతారు. ఇరవై ఏళ్ల తర్వాత ఫ్రీడమ్ వచ్చినట్లు ఉందంటూ ఎమోషనల్ అవుతారు. మా సొంత ఇంటికి మళ్లీ తిరిగి వచ్చినట్లు ఉందంటూ బాధపడతారు. అయినా ఇదంతా ఎవరు చేయమన్నారు రాజు అని అడిగితే మీకోసం నేనే చేశాను తాతయ్య అని రాజు అంటాడు. ఇదంతా మనసులో పెట్టుకుని రేఖ నిన్ను ఏదైనా చేస్తే అని అపర్ణ, సుభాష్ భయపడుతుంటే వాళ్లు కోరలు పీకి కూర్చోబెట్టాను వాళ్లింకేం చేయలేరని రాజు చెప్తాడు.

మరోవైపు ఇందు చేత సంతకం ఎలా చేయించాలని ఐశ్వర్య ఆలోచిస్తుంది. ఎవరి చేత చెప్పించినా సంతకం చేయదని, ఇందు సంతకం అవసరం లేకుండా ఎక్స్ పోలో పాల్గొనే ఛాన్స్ ఏమైనా ఉందా అని పార్వతీశంను అడగాలని ఫోన్ చేస్తుంది. పార్వతీశం ఇందు, రాజు గడ్డం మీసాలు పట్టుకునైనా సంతకం చేయించుకోమని ఎలాంటి ఆప్షన్ లేదని చెప్తాడు. ఇక చేసేదేం లేక ఐశ్వర్య.. రేఖ ద్వారా ఇందు చేత సంతకం చేయించుకోవాలని రేఖ రూంలోకి వెళ్తుంది. రూంలో బాధపడుతూ కూర్చున్న రేఖను చూసి శేషు సెటైర్లు వేస్తుంటాడు. ఏంటి ఆంటీ ఆ రాజు చెప్తుంటే మౌనంగా ఉండిపోయావని ఐషు అంటే మరేం చేయమంటావు ఐషు గొడవ చేయడం కన్నా మౌనంగా ఉండటమే బెటర్ అనిపించిందని రేఖ చెప్తుంది. ఒక పని కోసం వచ్చాను అది కాదని అర్థమైందని ఐషు చెప్తే, ఏంటా పని అని రేఖ అడుగుతుంది. ఆ ఇందు చేత సంతకం చేయిస్తావేమోనని అంటూ చెప్పగానే శేషు నవ్వుతూ అక్కకు లేక ఆవకాయ తింటుంటే చెల్లి వచ్చి చిల్లి చికెన్ అడిగిందట అంటాడు. చివరగా రూంలో ఉన్న రాజు, ఇందు వెనక నుంచి వచ్చి తనను హగ్ చేసుకున్నట్లు కలగంటుంటాడు. అప్పుడే వచ్చిన ఇందు చూసి ఆటపట్టిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 


 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com