Home

»

Tv News

జీవితం అన్‌ప్రెడిక్టబుల్.. జబర్దస్త్ మహేశ్ చేసిన కామెంట్స్ వైరల్!

Jun 27, 2026 12:15PM

'జబర్దస్త్' షో ద్వారా కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. 'రంగస్థలం', 'మహానటి' వంటి చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇటీవల రిలీజై అందరినీ అలరిస్తున్న  'సింగ్ గీతం' సినిమాలో కూడా కనిపించిన ఆయన.. ఇప్పుడు సోషల్ మీడియాలో చేసిన ఓ వీడియోతో వైరల్ అవుతున్నాడు. ఈ వీడియోలో అతని ఎక్స్ప్రెషన్స్ చాలా షాకింగ్ గా ఉన్నాయి. తాజాగా వీడియో  రిలీజ్ చేసిన మహేశ్.. "జీవితం చాలా అన్ ప్రెడిక్టబుల్ అని  ఎప్పుడు, ఎవరి లైఫ్ లో  ఏమవుతుందో చెప్పలేం. బయట కనిపించే దాన్ని చూసి నమ్మేయడం కరెక్ట్ కాదు. ముఖ్యంగా రిపోర్టర్లు, మీమర్స్..

నేను నిజం చెప్పే వరకు మీరనుకున్న ఎలాంటి  వార్తలు రాయొద్దు. త్వరలో జరిగిన విషయాన్ని నేనే అందరికీ చెబుతాను" అని అన్నాడు. ఐతే మహేష్ చేసిన ఈ కామెంట్స్ కొత్త మూవీ ప్రమోషన్స్ కి సంబంధించిందా లేదంటే తన లైఫ్ కి సంబంధించిందా అనేది సస్పెన్స్ గా ఉంది. ఈమధ్య కాలంలో ప్రమోషన్ వీడియోస్ ఇలాగే ఎమోషనల్ గా సంబంధం లేకుండా ఆడియన్స్ ని అట్ట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారు. మరి ఈ వీడియో ఏ సందర్భంలోనిది అనేది మహేష్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com