Home

»

Tv News

Godhavari : తండ్రి ఆశయాల కోసం జానూ పోరాటం.. నందు-మురళిల మధ్య క్రేజీ సీన్స్!

Jun 27, 2026 11:13AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -41 లో... నాన్న ఎందుకు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళావని జానూ వాళ్ళ ఇంటి ముందు కూర్చొని ఏడుస్తుంది. నువ్వు అన్ని జాగ్రత్తలు చెప్తుంటే ఏమో అనుకున్నా కానీ బాధ్యతలు చెప్పావని ఏడుస్తుంది. నువ్వు తోట గురించి ఇల్లు తాకట్టు పెట్టి లోన్ తీసుకున్నావని అంటున్నారు.. అలా కాదని ఎలా నిరూపించాలని జానూ ఎమోషనల్ అవుతుంది. మరుసటి రోజు నందు స్నానానికి వెళ్తుంది. బాత్రూం ముందు పెద్దావిడ కిన్నెర, గౌతమి వెయిట్ చేస్తారు.

నందు మాత్రం బయటకు రాదు.. తనని బయటకు రప్పించడానికి  అమెరికా నుంచి ఫోన్ వచ్చిందని పెద్దావిడ అంటుంది. దాంతో నందు బయటకు వచ్చి హడావిడిగా లోపలికి పరుగెడుతుంది. నీళ్ల మీద కాలు వేసి నందు జారీపడిపోతుంటే మురళి పట్టుకుంటాడు. కావాలనే నీళ్లు ఇక్కడ పడేసి పడిపోయేలా చేసావ్ కదా అని నందు అంటుంది. నీ పాటి అందెగత్తె దొరకదని అలా చేశాడని నందుపై మురళి వాళ్ళ అమ్మ శాంతి అంటుంది. ఆ తర్వాత జానూ ఇంట్లోకి కావల్సిన సరుకులు తీసుకొని వస్తుంది. బిల్లు పది వేలు అవుతుంది.

ఇవన్నీ ఎన్ని నెలలకి అని శాంతి అడుగుతుంది‌‌. ఒక్క నెలకే అత్తయ్య అని జానూ చెప్తుంది. సరుకులు కొంటేనే రిసీట్ ఇచ్చారు మరి నాన్న తోటకి డబ్బు కట్టినప్పుడు ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు కదా అని జానూ అనుకుంటుంది. సింహాద్రి దగ్గరికి వెళ్లి అంకుల్ మా నాన్న తోటకి డబ్బు కట్టినప్పుడు ఏదో ఒక పత్రం ఇచ్చే ఉంటారు కదా.. ఎక్కడ అది అని అడుగుతుంది. అలాంటివి ఏం ఇవ్వలేదు.మ మీ నాన్న కూడా అడగలేదు.. అడుగురా అంటే మొత్తం కట్టి ఇక రిజిస్ట్రేషన్ చేసుకుంటామని అన్నాడని సింహాద్రి చెప్తాడు. అయితే ఇప్పుడు ఆ తోట అమ్మిన రామారావు ఇంటికి పోలీసులతో వెళ్తాను‌ మీరు డబ్బు కట్టినట్లు సాక్ష్యం చెప్పాలని జానూ అనగానే అవన్నీ ఇప్పుడు ఎందుకు అమ్మ అని సింహాద్రి టెన్షన్ పడుతాడు. తోట గురించి ఖచ్చితంగా కనుక్కుంటానని జానూ వెళ్తుంది. తరువాయి భాగంలో నందుకి ఉక్కపోస్తుంటే మురళి వచ్చి ఫ్యాన్ తీసుకొని వచ్చి పెడతాడు. నందు అనుకోకుండా మురళికి డ్యాష్ ఇస్తుంది. అలా అనుకోకుండా తలలు తాకితే పెళ్లి అవుతుందని పెద్దావిడ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com