టీం లీడర్ ఐన ఇమ్మానుయేల్...బాలయ్య ఫాన్స్ కొడతారని భయం లేదా!
on May 1, 2023

అసలే ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి ఎండల్లో కూల్ కూల్ గా ఉండడానికి ఎన్నో జ్యుసెస్ తాగుతూ ఉంటాం. అవి హెల్త్ కి మంచిగా పనికొస్తాయి కానీ మైండ్ రిఫ్రెష్ గా ఉండాలి అంటే కామెడీ షోస్ చూస్తే చాలు. అలాంటి ఈ హాట్ సమ్మర్ లో ఆడియన్స్ ని రిఫ్రెష్ చేయడానికి కూల్ గా ఉంచడం కోసం ఎక్స్ట్రా జబర్దస్త్ సమ్మర్ స్పెషల్ షో ప్లాన్ చేసింది. అలా నెక్స్ట్ వీక్ రాబోయే షో ప్రోమోని రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో "కెవ్వు కార్తీక్ చలివేంద్రం" పేరుతో కార్తిక్ ఒక స్కిట్ చేసాడు. "ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం" మూవీలో రాజేంద్రప్రసాద్ ఆయిల్ లో తుండుగుడ్డ వేసి అతని కొడుకు వైపు విసిరినప్పుడు ఆ నూనెను వాడు పిండి గిన్నెలో వేసుకుంటూ తెలివిగా నూనె కొనకుండా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఆ బిట్ ని స్పూఫ్ గా చేసి చూపించారు నాటీ నరేష్, శాంతి స్వరూప్. సమ్మర్ అంటే ఇంకో స్పెషలిటీ కూడా ఉంటుంది. స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతాయి. వాటి హడావిడి కూడా ఎండాకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది. దాన్ని నేపథ్యంగా తీసుకుని ఆటో రాంప్రసాద్ ఒక స్కిట్ ప్లాన్ చేసుకున్నాడు. "రాంప్రసాద్ విద్యాసంస్థలు" అని పేరు పెట్టుకున్నాడు. తర్వాత బులెట్ భాస్కర్ స్కిట్ వేసాడు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసరికి భాస్కర్ వాళ్ళ అక్క తన పిల్లల్ని దింపేసి వెళ్ళింది.
ఇక మేనకోడలిని దగ్గరకు తీసుకుని ఒక్కసారి మావయ్య అని పిలువమ్మా అనేసరికి ఆ పాప అలాగే పిలిచింది. దాంతో తన మెడలో ఉన్న చైన్ తీసి ఆ పాప మెడలో వేసేశాడు. "ఎప్పుడూ ఇలానే మావయ్య" అని పిలుస్తూ ఉండాలి అని చెప్పేసరికి "ఫాన్స్ కొడతారని భయం లేదా మావయ్య" అని ఆ పాప అడిగింది. "పర్లేదమ్మ చిల్డ్రన్స్ కోటాలో కొట్టుకుపోతా" అని చెప్పాడు. తర్వాత ఇమ్మానుయేల్ వచ్చాడు. ఇంతవరకు ఇమ్మానుయేల్ కామెడీ చూసారు ఇకనుంచి ఇస్మార్ట్ ఇమ్మానుయేల్ కామెడీ చోడబోతున్నారు అన్నాడు. దానికి వర్ష " నీకు టీం లీడర్" ఎలా ఇచ్చారు అని అడిగింది. "కష్టపడ్డాను. రైటర్ గా చేసాను, భాస్కర్ స్కిట్స్ లో చేసాను, వెంకీ స్కిట్స్ లో చేసాను, కార్తీక్ స్కిట్స్ చేసాను, టీం లీడర్ అయ్యాను, సక్సెస్ అయ్యాను" అని చెప్పాడు. "అసలు టీం లీడర్ అంటే ఎవరండీ" అని కమెడియన్ బాబు అడిగేసరికి "టీంని ముందుండి నడిపించేవాడు" అని చెప్పాడు ఇమ్ము. ఇంతలో రాకేష్, సుజాత వచ్చేసరికి "వదిన నాకు టీం లీడర్ ఇచ్చారు..నన్ను ఆశీర్వదించు.." అని కాళ్ళ మీద పడేసరికి "ఏమిటి నువ్వు కూడా మా ఆయనలాగ కాళ్ళ మీద పడుతున్నావ్" అని సుజాత అనేసరికి రాకేష్ ఒక్కసారిగా అరిచాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



