Home

»

Tv News

Karthika Deepam2 : జ్యోత్స్న పెళ్లిచూపుల్లో ఊహించని ట్విస్ట్.. దీప పుట్టుకపై మాలిని సంచలన వ్యాఖ్యలు!

Jul 29, 2026 9:53AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -734 లో.....సూరజ్, జ్యోత్స్న ఇద్దరు శివన్నారాయణకి రెస్టారెంట్ కి సంబంధించిన ఫైల్స్ చూపిస్తారు. అప్పుడే ఒక ఫ్యామిలీ పెళ్లిచూపులకి వచ్చామని చెప్తారు. ఎవరు పంపించారని శివన్నారాయణ అడుగుతాడు. మేడం అని వాళ్ళు ఏదో మాట్లాడబోతుంటే అప్పుడే దశరథ్ వచ్చి దీప పంపించి ఉంటుంది. నిన్న వాళ్ళకి చెప్పానని అంటాడు. జ్యోత్స్నని కూర్చొమని చెప్తారు. సుమిత్ర వస్తుంది. జ్యోత్స్నని చూడడానికి వచ్చారని దశరథ్ చెప్తాడు.

అబ్బాయి వాళ్ళతో దశరథ్ వాళ్ళు మాట్లాడుతారు. అప్పుడే శివన్నారాయణ పక్కకి కార్తీక్ కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్తాడు. ఆ తర్వాత  మా జ్యోత్స్న మేడమ్ చాలా మంచిది అని తన గురించి సూరజ్ గొప్పగా చెప్తాడు కానీ ఒకే లోపం ఉందని సూరజ్ చెప్తాడు. ఏంటి అది అని వాళ్ళు అడుగుతారు. అందరు ఏం చెప్తాడోనని టెన్షన్ పడతారు. కార్తీక్, దీప కూడా అప్పుడే వస్తారు. ఏం లేదండి తనకి వంట రాదని చెప్తాడు. కార్తీక్ నువ్వే వాళ్ళతో మాట్లాడాలి మీరే పంపించారు కదా అని శివన్నారాయణ అనగానే మేం పంపించలేదని కార్తీక్, దీప అంటారు. మిమ్మల్ని పంపించింది వీళ్ళు కదా అని అబ్బాయి వాళ్ళని కార్తీక్ అడుగుతాడు. లేదు మేడమ్ మాలిని గారు అనగానే అందరు షాక్ అవుతారు. అప్పుడే మాలిని, దక్షిణామూర్తి ఎంట్రీ ఇస్తారు. మీరు వాళ్ళ మనుషులు అని తెల్వక ఇంతసేపు మాట్లాడానని శివన్నారాయణ అబ్బాయి వాళ్ళని పంపిస్తాడు. ఆ తర్వాత నా కూతురికి నువ్వు సంబంధం పంపించడం ఏంటని మాలినిని సుమిత్ర కోప్పడుతుంది.

అంటే మీరు పట్టించుకోవడం లేదు కదా.. తన వయసు వాళ్ళు పిల్లలతో ఉన్నారు. అది మాత్రం అలాగే ఉంది కార్తీక్ తో పెళ్లి జరిపిస్తానని చెప్పి మోసం చేశారని మాలిని అంటుంది. ఎవరో అనాధని కార్తీక్ పెళ్లి చేసుకొని వచ్చాడని మాలిని అంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు లేదు.. దీపపై ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాను తనకి అన్ని నేనే అని కార్తీక్ అంటాడు. మీరు సుమిత్ర అమ్మని అనే అంత వాళ్ళ అని మాలినిని దీప అడుగుతుంది. తనతో నీకేంటి అని మాలిని అంటుంది. తను నా అమ్మ అని దీప అనగానే అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com