Home

»

Tv News

ఆనందరావు, భాగ్యల నాటకాలకు ధీరజ్ గట్టి బుద్ధి.. రామరాజు గుండెకోత!

May 31, 2026 9:50AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -485 లో.. భాగ్యం, ఆనందరావు దగ్గరికి ప్రేమ, ధీరజ్, నర్మద వెళ్తారు. మీరు ఎన్ని చెప్పినా మారరా.. సిగ్గులేదా అని ధీరజ్ తిడుతుంటాడు. మేం ఏం తప్పు చేసి దొరికిపోయమో చెప్పండి క్లారిటీ మిస్ అవుతుంది.. మీకు ఏ విషయం తెలిసిందో ఏ రకమైన ఎక్స్ ప్రెషన్ ఇవ్వాలో అర్థం కావడం లేదని ఆనందరావు అంటాడు. దాంతో ధీరజ్ తన చెంపచెల్లుమనిపిస్తాడు. నీకు క్లారిటీ కావాలా అంటూ కొడుతునే ఉంటాడు.

మీరు మా నాన్న దగ్గరికి వెళ్లి నూరిపోసింది.. తెలిసిందని నర్మద అంటుంది‌ మీకు ఏదైనా సమస్య ముంచుకొస్తుందన్నప్పుడు మాత్రమే ఇలాంటివి చేస్తారు.. ఎందుకు ఇలా చేశారని నర్మద కోప్పడుతుంది‌ మేం ఏం ఉద్దేశ్శించి చెయ్యలేదని భాగ్యం యాక్టింగ్ చేస్తుంది.ఆ తర్వాత భాగ్యాన్ని ప్రేమ కొట్టబోతుంటే ఆగండి నా భార్యని నేనే అడుగుతానని కర్రతో భాగ్యాన్ని ఆనందరావు కొడుతాడు. కొద్దిసేపు అతను కొట్టాక భార్యలో భర్త సగం కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను కొట్టు భాగ్యం అనగానే భాగ్యం ఆనందరావుని కొడుతుంది. ప్రేమ కర్ర తీసుకొని కొట్టబోతుంటే ధీరజ్ ఆపుతాడు. మిమ్మల్ని ఇప్పుడు కేవలం మా వదిన ప్రెగ్నెంట్ తో ఉంది.. మీకు ఏదైనా అయితే తను డిస్టరన్ అవుతుందని అలోచించి ఏం చెయ్యట్లేదని ధీరజ్ వార్నింగ్ ఇస్తాడు. మరొకవైపు ధీరజ్ ని కేసు లో ఇరికించాలని భద్రవతి, సేనాపతి ప్లాన్ చేస్తారు. ఇన్‌స్పెక్టర్ తో ఒక రౌడీ మాట్లాడతారు.

ఆ తర్వాత ప్రేమని ధీరజ్ పిలిచి తలకి ఆయిల్ పెట్టు అంటాడు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత రామరాజు ఇంట్లో గీసిన గీత దగ్గర కూర్చొని ఇది ఇంట్లో గీసినట్లు లేదు.. నా మనసుకి గీసినట్లు ఉందని వేదవతితో రామరాజు చెప్తూ బాధపడుతాడు. అప్పుడే ప్రసాదరావు ఒక వెహికల్ లో కూతురు వేరు కాపురం పెట్టిందని అవసరం అయిన సామాను తీసుకొని వస్తాడు. అవేంటి నాన్న అని నర్మద అడుగుతుంది. ఇంకా అర్థం కాలేదా.. పుట్టింటి నుంచి సారె తెచ్చారని వల్లి అంటుంది. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే తెలివిగలదానివి అని వల్లిని ప్రసాదరావు పొగుడుతాడు. ఇవన్నీ మర్యాదగా తీసుకొని వెళ్ళిపోనని ప్రసాదరావుపై నర్మద కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com