Home

»

Tv News

జ్యోత్స్నకు షాకిచ్చిన తాతయ్య.. ఆ సీఈఓ పదవి ఊడినట్లేనా?

May 31, 2026 9:58AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika deepam2).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -684 లో......  సూరజ్ తనకి నష్టపరిహారంగా జ్యోత్స్న సారీ చెప్పినట్లు ఒక ఫ్లెక్సీ.... ఒక గంట పాటు జ్యూస్ లు సర్వ్ చెయ్యాలని సూరజ్ చెప్పగానే దానికి నేను ఒప్పుకోనని జ్యోత్స్న అంటుంది. నోరు ముయ్ చేసింది తప్పు పైగా వాదిస్తుందని సుమిత్ర అంటుంది. నువ్వు ఏం అంటావ్ దశరథ్ అని శివన్నారాయణ అడుగుతాడు. మీ ఇష్టం నాన్న.. మీరు ఏం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి అని దశరథ్ అంటాడు.

సరే బాబు నువ్వు అనుకున్న న్యాయం జరుగుతుంది. అది జరిగేలా కార్తీక్ చూసుకుంటాడని శివన్నారాయణ చెప్తాడు. ఎందుకే పెద్ద వాళ్ళ పరువు తీసే పనులు చేస్తావని జ్యోత్స్నని కాంచన తిడుతుంది. ఆ తర్వాత పదండి మేడం మీకు ఇప్పుడు ఫోటో షూట్ ఉందని జ్యోత్స్నతో కార్తీక్ అంటాడు. ఆ తర్వాత జ్యోత్స్నని బయటకు తీసుకొని వెళ్లి ఫ్లెక్సీ కోసం ఫోటో స్టిల్స్ తీస్తాడు కార్తీక్. రేపు మేడమ్ ని స్టాల్ దగ్గరికి తీసుకొని రండి అని కార్తీక్ కి సూరజ్ చెప్తాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి శివన్నారాయణ వచ్చి.. ఈ అబ్బాయి ఎవరో ఆత్మాభిమానం గలవాడు.. ఇలాంటి వాడు బిజినెస్ లో ఉంటే బాగుంటుందని శివన్నారాయణ అనగానే చూద్దాం తాత ఏం జరుగుతుందోనని కార్తీక్ అంటాడు.

ఆ తర్వాత శివన్నారాయణ, దశరథ్ మాట్లాడుకుంటుంటే జ్యోత్స్న వచ్చి ఆ సూరజ్ చెప్పిన దానికి నేను ఒప్పుకోను తాత అని జ్యోత్స్న అంటుంది. మరి అప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నావని శివన్నారాయణ కోప్పడుతాడు. నువ్వు సీఈఓగా పనికి రావని చెప్పడానికి ఈ ఒక్క విషయం చాలు. సీఈఓ అంటే అన్ని రకాల వ్యక్తులతో మాట్లాడే నైపుణ్యం ఉండాలి.. వాళ్ళని తక్కువ చూసి కోపంగా మాట్లాడితే నెక్స్ట్ డే వాళ్ళు వస్తారా. నువ్వు నేను చెప్పినట్లు వినే మనవరాలిగా ఉంటేనే అన్ని గౌరవలు దక్కుతాయి. కేవలం మనవరాలిగా ఉండాలంటే ఉండు అని శివన్నారాయణ చెప్తాడు. నీకు వేరే దారి లేదు.. సూరజ్ గాడు చెప్పినట్లు చెయ్యాలని జ్యోత్స్నతో పారిజాతం చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com