Home

»

Tv News

Podarillu: ప్రేమ వ్యవహారం గుట్టు రట్టు.. 'పొదరిల్లు' లేటెస్ట్ ఎపిసోడ్ లో ఫుల్ కామెడీ!

Mar 27, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podarillu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -79లో... మహా, కన్నా ఒకవేళ శైలు ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేశారేమోనని కేశవ టెన్షన్ పడతాడు. శైలుకి కేశవ ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఏ బుస్సు ఇందాక ఫోన్ చేసావా అని అడుగుతాడు.  చేయలేదు ముంగీస అని శైలు అంటుంది. ముంగీస అన్నావో నీ సంగతి చెప్తానని కేశవ అంటాడు. అదంతా కన్నా, మహా వింటారు. ఆ తర్వాత కేశవ లోపలికి వస్తాడు. కన్నాని బయటకు తీసుకొని వెళ్లి ఈ ఫోన్ కి ఎవరైనా కాల్ చేసారా అని అడుగుతాడు. లేదని కన్నా అబద్ధం చెప్తాడు.

ఆ తర్వాత రాత్రి కన్నా, మహా ఇద్దరు కలిసి భోజనానికి ఏర్పాట్లు చేస్తారు. కేశవ రాగానే పొయ్యి మీద ఏదో బుస్సు బుస్సు మంటుందని మహా, కన్నా తనని ఏడిపిస్తారు. అందరు తింటునంత సేపు బుస్సు, ముంగిస అంటూ మహా కన్నా ఇద్దరు కేశవని ఆటపట్టిస్తారు. శైలు ఫోన్ చేస్తే వీళ్ళు మాట్లాడారు అని కేశవకి అర్థమవుతుంది. 

దాంతో బయటకు వెళ్లి శైలుకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఫోన్ చేసి ఏమన్నావే అని అడుగుతాడు. మనిద్దరం లవర్స్ అనుకునేలా మాట్లాడినా అని శైలు అనగానే కేశవ కోప్పడతాడు. మర్యాదగా నా ఫోన్ తీసుకొని వచ్చి ఇచ్చెయ్ అని శైలు వార్నింగ్ ఇస్తుంది.

ఆ తర్వాత మీరు సర్టిఫికెట్ రీ అప్లికేషన్ కి వెళ్తున్నారా.. నేను వస్తానని మహాతో చక్రి అంటాడు. మీరు ఎవరు రావడానికి అని మహా అంటుంది. మిమ్మల్ని ఒంటరిగా పంపించనని చక్రి అంటాడు. అవసరం లేదని మహ వాదిస్తుంది. 

ఆ తర్వాత అందరు పడుకుంటారు కావాలనే కేశవని ఆటపట్టించేందుకు బుస్సు బుస్సు అంటూ కన్నా అంటుంటే పాము ఎక్కడ అంటూ నారాయణ కర్రతో వస్తాడు. తరువాయి భాగంలో మహా సర్టిఫికెట్స్ కోసం వెళ్తుంటే తనకి తోడుగా నారాయణ వెళ్తాడు. దాంతో మహా ఇబ్బందిపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com