Home

»

Tv News

Jayam serial: వీరు డిజప్పాయింట్.. రౌడీలని చితకబాదిన ప్రమీల!

Mar 08, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -211 లో... ప్రమీల దగ్గరికి వీరు కొంతమంది రౌడీలని పంపిస్తాడు. వాళ్ళు టీజ్ చేస్తే ప్రమీల మళ్ళీ సూపర్ మార్కెట్ వంక చూడదని వీరు ప్లాన్ చేస్తాడు. సూపర్ మార్కెట్ లో ప్రమీల స్టాక్ గురించి తెలుసుకుంటుంది. అప్పుడే రౌడీలు వచ్చి తనని ఏడిపిస్తారు. ప్రమీల ఇబ్బంది పడుతుంది. అదంతా వీరు సీసీటీవీలో చూస్తాడు. అప్పుడే రుద్ర ఎంట్రీ ఇస్తాడు. ప్రమీల దగ్గరికి రుద్ర వచ్చి మోటివేషన్ చేస్తాడు. దాంతో ప్రమీల రౌడీలని కొడుతుంది.

అదంతా వీరు సీసీటీవీలో చూసి, ప్లాన్ ఫెయిల్ అయిందని డిజప్పాయింట్ అయి వెళ్తుంటే.. ఏంటి వీరు వచ్చావని రుద్ర అడుగుతాడు. ఏం లేదు బావ ప్రమీలని కంగ్రాచ్యులేట్ చెయ్యడానికి వచ్చానని వీరు చెప్తాడు. అవునా అని రుద్ర అంటాడు. అప్పుడే రౌడీలని మక్కమ్ తీసుకొని వస్తాడు. ఎవరు వాళ్ళు అని పెద్దసారు అడుగుతాడు. ప్రమీలని ఇర్రిటేట్ చేసారని రుద్ర చెప్తాడు. వీరు నువ్వు అయితే వాళ్ళకి కరెక్ట్ పనిష్మెంట్ ఇస్తావ్ ఇవ్వు అని రుద్ర అనగానే.. వీరు వాళ్లని కొట్టి ప్రమీలకి సారీ చెప్పిస్తాడు. ఆ తర్వాత కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చావ్ కదా చెప్పమని రుద్ర అనగానే ప్రమీలకి వీరు కంగ్రాట్స్ చెప్తాడు.

మరొకవైపు గంగ ఇంట్లో మిర్చి బజ్జిలు చేస్తుంటే అప్పుడే వాళ్ళ అన్న రంగా వచ్చి తింటాడు. అప్పుడే ఇందుమతి వస్తుంది. తనకి మిర్చీలు కావాలని అంటుంది. నేను ఇవ్వను .. నువ్వు తినలేవు.. ఇవి కారంగా ఉంటాయని రంగా అనగానే నా గురించి నీకు తెలియదని ఇందుమతి అంటుంది. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి పోటీ పెట్టుకుంటారు. ఎవరైతే ఎక్కువ మిర్చి బజ్జిలు తింటారోనని సూర్య, వంశీ వాళ్ళు అందరు వెయిట్ చేస్తుంటారు. ఇద్దరు ఫాస్ట్ గా తింటారు. 

తరువాయి భాగంలో అందరు హోలీ సెలెబ్రేషన్స్ లో ఉంటారు. వీరు మాత్రం రుద్రని చంపడానికి కత్తి పట్టుకొని వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com