Home

»

Tv News

Brahmamudi: కావ్య కూతురికే ఆస్తులు, గార్డియన్ గా అపర్ణ.. షాక్ లో రేఖ!

Mar 01, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -968 లో... రేఖ పెళ్లి చేసుకొని ఇంట్లో అడుగు పెడుతుంటే వద్దని అపర్ణ ఆపుతుంది. అయినా పట్టించుకోకుండా రేఖ తన భర్త ఇంకా ఆడపడుచుతో వస్తుంది. నా మాట అంటే లెక్కలేదా అని అపర్ణ కోప్పడుతుంది. నా జోలికి వచ్చేముందు ఒకసారి మా అన్నయ్య, అమ్మని గుర్తుచేసుకోమని రేఖ అంటుంది. 

మీరు ఇప్పుడు నా చెప్పు చేతుల్లో ఉండాలి. ఈ దుగ్గిరాల ఆస్తులు మొత్తం నాకు ఇవ్వాలని రేఖ అనగానే అది జరగదని అపర్ణ చెప్తుంది. ఎలా జరగదని రేఖ సైగ చెయ్యగనే తన భర్త పాప మెడపై కత్తి పెడతాడు. సుభాష్ ని రేఖ ఆడపడుచు కొడుతుంది. దాంతో అపర్ణ ఏడుస్తుంది. నువ్వు ఎంత గీ పెట్టినా ఆస్తులు నీకు రావు ఎందుకంటే ఆస్తులన్నీ కావ్య పేరున ఉన్నాయి. తను లేదు కాబట్టి తన కూతురు ఇందుకి వస్తుంది. తనకి పాతికేళ్ళ వయసు వచ్చేవరకు ఆస్తులు తన పేరు మీదే ఉంటాయి. గార్డియన్ గా నేను ఉంటానని అపర్ణ అనగానే రేఖ షాక్ అవుతుంది. 

ఏంటి రేఖ ఆస్తులు అన్ని నీ గుప్పిట్లోకి తెచ్చుకుంటానన్నవ్ అంతా అబద్దమేనా అని రేఖ ఆడపడుచు అంటుంది. దాంతో కావ్య పాప మేజర్ అయ్యేవరకు ఓపిక పడుదాం. అంతవరకు నేనే గార్డియన్ ని అని అపర్ణని రేఖ బ్లాక్ మెయిల్ చేయించి సంతకం పెట్టించుకుంటుంది.

మరొకవైపు స్వరాజ్ ఒక్కసారిగా నిద్రలోంచి లేచి అమ్మ అంటాడు. ఏమైందని అతన్ని తీసుకొని వెళ్లిన వాళ్ళు అడుగుతారు. స్వరాజ్ ని వాళ్ళు సొంత బిడ్డలాగా చూసుకుంటారు. 

తరువాయి భాగంలో కావ్య కూతురు పెరిగి పెద్దదవుతుంది. అచ్చం కావ్యలాగే ఉంటుంది. మరొకవైపు స్వరాజ్ పెద్దవుతాడు. అచ్చం రాజ్ లాగే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com