.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -620 లో..... గుడిలో తన అన్న చందు మాజీ లవర్ అంజలిని ధీరజ్ చూస్తాడు. కానీ అంజలి పట్టించుకోకపోవడంతో తను పొరపడినట్లు ధీరజ్ అనుకుంటాడు. అంజలి తప్పించుకొని వెళ్లిపోతుంది. అంతా కన్ ఫ్యూజింగ్ గా ఉందే అని ధీరజ్ తల పట్టుకుంటాడు.
మరోవైపు లంచం డబ్బు కోసం సాగర్ ఫోన్లో మాట్లాడుతుంటాడు. అప్పుడే ధీరజ్ అక్కడికి వెళ్లి ఆ దూరంగా వెళ్తున్న అమ్మాయి అంజలినే కదా అని అడుగుతాడు. ఆ అమ్మాయిని చూసి అంజలినే అని సాగర్ చెప్తాడు. వెళ్లి పెద్దోడికి చెప్దామని సాగర్ అంటాడు. కానీ అంజలిని ప్రాణంగా ప్రేమించిన అన్నయ్యకు మళ్లీ పాత గాయం గుర్తు చేయొద్దని ధీరజ్ ఆపుతాడు. చందుకు ఈ విషయం తెలిస్తే బాధపడతాడని ఇద్దరూ సైలెంట్ గా ఉండాలని అనుకుంటారు.
అప్పుడే తింగరి ప్రేమ వచ్చి ధీరజ్ చెవి పట్టుకుంటుంది. ఇంత అందమైన భార్యను పక్కనపెట్టుకొని వేరే అమ్మాయిని చూస్తావేంటని అడుగుతుంది. ఒక కాలు, ఒక చేయి తీసేస్తానని ధీరజ్ చేయిని మెలిపెడుతుంది ప్రేమ. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావని ధీరజ్ అంటాడు. కానీ అదేమీ వినని ప్రేమ తన కొంగుతో ధీరజ్ చేతులను కట్టేసి లాక్కెళ్తుంది. రామరాజు కుటుంబమంతా అమ్మవారికి మొక్కుతుంది. అప్పుడే వల్లి సైలెంట్ గా అక్కడికి వెళ్తుంది. మొగుణ్ని కొంగున కట్టేసుకోవడం అంటే ఇదేనన్నమాట అని అక్కడున్న ఆడవాళ్లు అంటారు.
వేదవతి ఫైర్ అవుతూ నీ కళ్లు సంతోషంగా ఉన్నవాళ్లపై పడ్డాయా అని వల్లిపై అరుస్తుంది. భర్తలందరూ భార్యలను ఆశీర్వదించాలని పూజారి చెప్పి అందరికి అక్షింతలు ఇస్తాడు. రామరాజు, తిరుపతి, సాగర్, ధీరజ్ తమ భార్యలను ఆశీర్వదిస్తారు. అప్పుడే వల్లి అక్షింతలు తీసుకుని చందు దగ్గరకు వెళ్తుంది. ఈ చీప్ ట్రిక్స్ నా దగ్గర ఉపయోగించకని చందు సీరియస్ గా చెప్తాడు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా కరిగేది లేదని వేదవతి అంటుంది. ఇటు భాగ్యం ఇంటికి భద్రావతి వచ్చి చందు పంపిన విడాకుల నోటీసును ఇస్తుంది. రామరాజు తన కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాడని అబద్ధాలు చెప్పి భాగ్యాన్ని రెచ్చగొడుతుంది. దీంతో భాగ్యం ఊగిపోతూ రామరాజు పరువు తీయడానికి బయలుదేర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)

