
నటి రాధికా ఆప్టే మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ తెలుగు సినిమాలో నటించడం తనకు ఏమాత్రం నచ్చలేదని చెప్పడంతో కొత్త వివాదం మొదలైంది. ఆమె నేరుగా సినిమా పేరు చెప్పకపోయినా.. వివరాలను బట్టి అది బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ అని నెటిజన్లు భావిస్తున్నారు.
'అక్క' వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక షోలో పాల్గొన్న రాధికా ఆప్టే.. తెలుగు సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక తెలుగు సినిమాలో తన పాత్ర మేనమామను పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని, తనకంటే చాలా పెద్ద వయసున్న నటుడితో రొమాన్స్ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
అంతేకాదు.. సినిమా మధ్యలోనే తన పాత్ర చనిపోతుందని, ఆ తర్వాత సదరు నటుడు తనను భుజాలపై వేసుకుని యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి వచ్చేదని వివరించారు. ఆమె చెప్పిన ఈ క్లూస్ ఆధారంగా నెటిజన్లు బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమానే అని గుర్తించారు.

రాధికా ఆప్టే వ్యాఖ్యలపై తెలుగు సినీ అభిమానులు, నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ‘లెజెండ్’ సినిమాలో నటించడం అంతగా నచ్చకపోతే.. ఆ తర్వాతి ఏడాదే బాలకృష్ణతో కలిసి ‘లయన్’ సినిమాలో ఎందుకు నటించారని ప్రశ్నిస్తున్నారు. సినిమా కథ, పాత్ర గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు అంగీకరించి, ఇన్నేళ్ల తర్వాత ఇలా మాట్లాడటం ఏమిటని విమర్శిస్తున్నారు.
మరోవైపు బాలకృష్ణ అభిమానులు గతంలో రాధికా ఆప్టే ‘లెజెండ్’ సినిమా గురించి ప్రశంసించిన పాత వీడియోలను షేర్ చేస్తున్నారు.
ఇటీవల పలువురు హీరోయిన్లలకు బాలీవుడ్ మెప్పు పొందడం కోసం అక్కడి కార్యక్రమాల్లో సౌత్ సినిమాలను తక్కువ చేసి మాట్లాడటం ఫ్యాషన్ గా మారిపోయింది. అక్కడి సినిమాల్లో ఎన్నో బోల్డ్ పాత్రలు చేస్తుంటారు. కానీ, ప్రతిసారి సౌత్ సినిమాలకు టార్గెట్ చేస్తున్నారు. డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేసేటప్పుడు లేని అభ్యంతరం.. ఇక్కడ అవకాశాలు తగ్గగానే.. బాలీవుడ్ ని కాకా పట్టడానికి ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి: మెగాస్టార్ కోరిక.. కీలక హామీ ఇచ్చిన అమిత్ షా.!
[Radhika Apte Controversy, Radhika Apte Legend Movie, Radhika Apte Telugu Cinema, Nandamuri Balakrishna, Radhika Apte, Legend Movie, Lion Movie, Telugu Film News]




.webp)
