.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -250 లో... నారాయణ మంచివాడని, గొప్పవాడని కన్నాకు చెప్తుంది మహాలక్ష్మి. కన్నా మాత్రం వినడు. ఆయన గురించి తెలిస్తే మాకంటే ఎక్కువ ఇష్టపడతావని మహా అంటుంది. మమ్మల్ని కన్నాడు కానీ మా గురించి పట్టించుకున్నాడా, తాగడం తప్పా ఏమైనా చేశాడా, మా అమ్మ వెళ్లిపోడానికి కారణం అతనే అని కన్నా అంటాడు. దానికి గ్యారెంటీ ఏంటీ, మనకు తెలియనప్పుడు ఎవరిని నిందించొద్దని మహా చెప్తుంది.
మనం నమ్మింది అబద్ధమని తెలిసినప్పుడు మనమే ఇబ్బందిపడాల్సి వస్తుందని మహా అంటుంది. పెద్ది నిన్ను సొంత కొడుకులా పెంచుకున్నాడా, తనతోపాటు అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు అని చెప్తుంది. ఆ బృందావనంలో కృష్ణుడు ఉంటే సంతోషంగా ఉంటుంది.. ఈ బృందావనంలో కన్నా ఉంటే సంతోషంగా ఉంటుందని, నువ్వు లేకపోతే వాళ్లు సంతోషంగా ఉండరని మహా చెప్తుంది. నన్ను క్షమించు వదినా, ఆయన మీద కోపంగా వెళ్లాను కానీ అన్నయ్యలకు దూరంగా ఉండాలని కాదని కన్నా అంటాడు.
నువ్వు మా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ వదినా అని కన్నా అంటాడు. మా సుపుత్రుడిని తిట్టవుగా అని మహా అంటే అది ఆయన ప్రవర్తనపై ఉంటుందని చెప్పి కన్నా కాలేజ్‌కి వెళ్తాడు. మరోవైపు శైలు గురించి కేశవతో మాట్లాడతాడు అసిస్టెంట్. ఇంతలో కేశవ ఫోన్‌కు తన షాప్ కొత్త లుక్ డిజైన్ ఫొటో వస్తుంది.. అది మహాలక్ష్మి పంపించిందని చెప్తాడు. ఇంతలో శైలు వస్తుంది. డిజైన్ చాలా బాగుందంటుంది. మహాలక్ష్మి చేసిందని కేశవ చెప్పేసరికి శైలు ఫీల్ అవుతుంది.
నాకు ఏ విషయం చెప్పట్లేదని, మీకు మీ వదిన ఉండగా నేనెందుకు గుర్తుకొస్తానని శైలు అలుగుతుంది. ముద్దు లేదు ముచ్చటలేదని అంటుంది. ఇకనుంచి మన పెళ్లి అయ్యేవరకు నీ కొంగు చుట్టూ తిరుగుతాను, షాపెందుకు పక్కనపెడతా అని కేశవ అంటాడు. మరోవైపు పెద్ది దగ్గరికి వెళ్లి కన్నా హగ్ చేసుకుంటాడు.బాధపెట్టినందుకు క్షమించమంటాడు. ఏది ఆలోచించకుండా చేయకు, నీకు ఏదైనా జరిగితే ఈ అన్నయ్యకు కూడా అదే ఆఖరి రోజు అవుతుందని పెద్ది ఎమోషనల్ గా అంటాడు. ఇంతలో మనీషా రావడం చూసి కన్నా సెటైర్లు వేస్తాడు.. మనీషాకు తప్పుడు తెలుగు పదాలు నేర్పి ఆడుకుంటాడు. చివర్లో మహాను కలిసిన చక్రి తనను పెళ్లి చేసుకుంటుందేమోనని పది బస్తాల కొబ్బరికాయలు ఆర్డర్ పెడతాడు. దారిలో ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




.webp)
.webp)
