వాళ్లని ఒక్కటి చెయ్యాలని చూస్తున్న వేదవతి.. కొడుకు గురించి తెలుసుకున్న రామరాజు!
on Feb 6, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -74 లో.... విశ్వ దగ్గరికి రామరాజు వచ్చి ఇంకొకసారి నా కొడుకు జోలికి వస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ధీరజ్ టాబ్లెట్ కోసం వెతుకుతు ఉంటాడు. అప్పుడే ప్రేమ వచ్చి ఏం కావాలి చెప్పు హెల్ప్ చేస్తానని ప్రేమ అనగానే నువ్వు హెల్ప్ చేస్తావా అంటూ ధీరజ్ వెటకారంగా మాట్లాడతాడు.
ఆ తర్వాత ధీరజ్ టాబ్లెట్ వేసుకుంటూ వాటర్ తీసుకొని రమ్మని వేదవతిని పిలుస్తాడు. వేదవతి వాటర్ తీసుకొని వస్తుంటే.. నర్మద ఆపుతుంది. ధీరజ్ పనులు కూడా మీరే చేస్తే ప్రేమ, ధీరజ్ లు ఎప్పుడు ఒకటి అవుతారు. ప్రేమ తీసుకొని వెళ్తుంది ఆగండి అంటూ నర్మద ఆపుతుంది. ధీరజ్ వాటర్ అని పిలుస్తుంటే ప్రేమ వాటర్ తీసుకొని వెళ్తుంది. దీరజ్ తీసుకోడు ప్రేమ కోపంగా అక్కడ పెట్టి వెళ్ళిపోతుంది. దాంతో దీరజ్ గదిలో నుండి బయటకు వస్తాడు. కింద పడిపోతుంటే ప్రేమ పట్టుకుంటుంది. అది చూసి నర్మద వేదవతి లు హ్యాపీగా ఫీల్ అవుతారు. విశ్వ కోపంగా ఇంటికి వస్తాడు. జరిగింది మొత్తం చెప్పగానే భద్రవతి కోపంగా రామారాజుని పిలుస్తుంది.
ఎందుకు నా అల్లుడిపై చెయ్ వేసావని అడుగుతుంది. నా కొడుకు జోలికి ఇంకోసారి వస్తే మర్యాదగా ఉండదు పెంపకం అలాగే ఉంటుందా అని రామరాజు కోప్పడతాడు. పెంపకం గురించి నువ్వే మాట్లాడాలి ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. పెద్దోడు ఒక అమ్మాయిని ప్రేమించిన తాగి పడిపోతున్నాడు అనగానే అందరు షాక్ అవుతారు. తరువాయి భాగంలో ప్రేమపై కోపం తో ధీరజ్ పడుకోవడానికి బయటకు వెళ్తాడు. తిరుపతి వాళ్ళు మళ్ళీ గదిలోకి పంపిస్తారు. ప్రేమ కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
