Illu illalu pillalu : తన వెనక ఏదో జరుగుతుందని డౌట్ పడిన రామరాజు.. ఆ నిజం తెలుసుకోగలడా!
on Dec 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -18 లో.....అందరు భోజనం చేస్తుంటే.. మనం రేపు ఒక దగ్గరికి వెళ్లి పెళ్లి గురించి మాట్లాడాలి నాన్న అని సాగర్ అంటుండగా.. అప్పుడే చందు డ్రింక్ చేసి లోపలికి వస్తాడు. అందరు అతన్ని చూసి షాక్ అవుతారు. సాగర్, ధీరజ్ లు ఏదో ఫుడ్ పోయిషన్ అయి ఉంటుందని కవర్ చేయబోతుంటే.. వాడు తాగి వచ్చాడు అది క్లియర్ గా తెలుస్తుందని రామరాజు కోప్పడతాడు.
చందు చెంప చెల్లుమనిపిస్తాడు రామరాజు. అసలు వీడికి ఈ తాగుడు అలవాటు ఎందుకని అంటాడు. అంత అయిపోయిందని.. చందు అంటుంటే.. ఏం లేదు నాన్న జాబ్ లో ప్రమోషన్ గురించి అని ధీరజ్ కవర్ చేస్తాడు. నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుందని రామరాజు అనుకుంటాడు. ఆ తర్వాత తన బామ్మర్దితో రామరాజు డ్రింక్ చేస్తూ అసలు పెద్దోడు ఎందుకు ఇలా చేస్తున్నాడు.. పెళ్లి అయితే వచ్చే భార్య ఏమనుకుంటుంది. వాడు ఏదో బాధపడుతున్నాడు.. ఏం జరిగిందో చెప్పట్లేదని రామరాజు బాధపడతాడు. మరొకవైపు రామరాజు పెద్ద కూతురు కామాక్షి తన భర్త సామానుకి వెళ్తుంటే రైస్ మాత్రం తీసుకొని రాకండి. ఎందుటే మ నాన్న కి రైస్ మిల్ ఉంది కదా ఎక్కువ తెచ్చుకొని, కొన్ని అమ్ముకుందాం అంటుంది. ఆ తర్వాత సాగర్, ధీరజ్ లు కామాక్షి ఇంటికి వస్తారు. సాగర్ ప్రేమ విషయం చెప్పి హెల్ప్ చేయమంటారు.
నాన్న గురించి తెలిసే మీరు అంటున్నారా అని కామాక్షి భయపడి.. నాకు ఏ సంబంధం లేదని పంపిస్తుంది. ఆ తర్వాత నర్మద అదే పనిగా మా ఇంటికి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నారా అంటూ కాల్ చేస్తూనే ఉంటుంది. ధీరజ్ లిఫ్ట్ చెయ్యమనడంతో సాగర్ లిఫ్ట్ చేసి వస్తున్నామని అనగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read