Eto Vellipoyindhi Manasu: అత్తని బెదిరించిన కోడలు..చివరికి ఏం జరిగిందంటే!
on Dec 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -268 లో.... సందీప్ కి శంకర్ ఫోన్ చేసి మీ అన్నయ్యని కలిసి నిజం చెప్తానని అనగానే.. సందీప్ భయపడతాడు. ఇక బావగారికి నిజం తెలిస్తే మన పరిస్థితి అంతేనని శ్రీవల్లి కంగారు పడుతుంది. దాంతో శ్రీలత టెన్షన్ తో నందినికి ఫోన్ చేస్తుంది. కానీ నందిని ఫోన్ కట్ చేస్తుంది అయిన మళ్ళీ శ్రీలత చేస్తుంది. దంతో చిరాకుగా ఏంటి శ్రీలత గారు ఫోన్ చేస్తున్నారంటూ కోప్పడుతుంది.
ఆ తర్వాత శంకర్ ఆఫీస్ కి శ్రీలత వెళ్లి.. సీతాని కలిస్తే పరిస్థితి ఏంటి.. కలవకుండా ఆపమని చెప్పగానే.. సరే నేను చూసుకుంటానని నందిని అంటుంది. మరొకవైపు శంకర్ ఆఫీస్ కి వస్తాడు. మాణిక్యాన్ని కలుస్తాడు. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి వస్తాడు. అయ్యో శంకర్ ని అపుదాం అంటే సీతా దగ్గరికి వెళ్లిపోయాడే అని నందిని అనుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ దగ్గరికి శంకర్ రావడం వీడియో కాల్ చేసి శ్రీలతకి చూపిస్తుంది రామలక్ష్మి. నేను ఒక సైగ చేస్తే నిజం చెప్తాడు. కానీ మీరు విడాకుల పత్రాలు నేనే పంపానని మీరు ఒప్పుకొని సీతా గారిని నన్ను ఒకటి చెయ్యాలి.. అప్పుడే శంకర్ నిజం చెప్పకుండా ఆగిపోతాడని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత అమ్మ ఏం చేసిన నా గురించే అన్నావ్ కదా.. ఇప్పుడు ఇది చెయ్ వాళ్ళని కలుపుతానని మాట ఇవ్వు అని సందీప్ అనగానే శ్రీలత సరే అంటుంది. దాంతో శంకర్ నిజం చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీతాకాంత్ ని తీసుకొని ఇంటికి వెళ్తుంది రామలక్ష్మి. మీకు సర్ ప్రైజ్ అని సీతాకాంత్ ని ఇంట్లో కి తీసుకొని వస్తుంది. లోపలికి వెళ్లేసరికి అమ్మ ఏంటని సీతాకాంత్ అడగ్గానే.. తాతయ్యకి బాగోలేదని చెప్తుంది. ఇదేనా సర్ ప్రైజ్ ఇక నువ్వు మారవని రామలక్ష్మిపై సీతాకాంత్ చిరాకుపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read