Karthika Deepam2 : దీపే అసలైన వారసులైన విషయం తెలుసుకున్న జ్యోత్స్న.. ఏం చేయనుంది?
on Dec 2, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'( karthika Deepam2).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -217 లో..... పారిజాతం ఇంటికి దాస్ వచ్చి సుమిత్ర దశరథ్ లు ఉన్నారా అని.. అడుగగా వాళ్ళ తో నీకేం పని.. వాళ్లు ఊళ్ళో లేరని శివన్నరాయణ తిట్టి పంపిస్తాడు. ఇతను ఎందుకు వాళ్ళ గురించి అడుగుతున్నాడని జ్యోత్స్న తన వెనకాలే వెళ్లి మా మమ్మీ డాడ్ లని ఎందుకు కలవాలనుకుంటున్నావు.. ఆ కుబేర్ ఫోటో పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావంటూ జ్యోత్స్న అడుగుతుంది. నాకు నిజం తెలిసింది అందుకే అని దాస్ అనగానే.. ఏం నిజమని జ్యోత్స్న అడుగుతుంది.
మరొక వైపు కార్తీక్ బుక్స్ సర్దుతుంటే చిన్నప్పుడు తన ప్రాణం కాపాడి చైన్ తన దగ్గర పడిసుకుంటుంది దీప. ఆ చైన్ కార్తీక్ చూసి ఎక్కడున్నావ్.. అప్పుడు నా ప్రాణాలు కాపాడావ్ ఇప్పుడు ఎక్కడున్నావ్ ఎప్పటికైనా నిన్ను కలుస్తానని కార్తీక్ చైన్ చూసుకుంటూ అంటాడు. అప్పుడే దీప రావడం చూసి వెనకాల చైన్ దాస్తాడు. మీరు ఎందుకు అత్తయ్య వాళ్ళకి నిజం చెప్పారని దీప అడుగుతుంది. చెప్పాల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్పాలని కార్తీక్ అంటాడు. ఏంటి బాబు చేతిలో ఎప్పటికైనా కలుస్తాను అంటున్నారని దీప అడుగగా.. ఏదో ఫ్రెండ్ అని చెప్తాడు. దీప వెళ్ళిపోయాక ఇప్పుడు నీకు చెప్పొచ్చు.. మళ్ళీ జ్యోత్స్న అప్పుడు కాపాడలేదు ఈ అమ్మాయి కాపాడిందని చెప్పాల్సి ఉంటుంది. అదంతా ఇప్పుడు ఎందుకు నా ప్రాణలు కాపాడిన అమ్మాయి ఎదురుపడితే తనే నా ప్రాణం కాపాడిందని అప్పుడు నీకు పరిచయం చేస్తాను. నా రక్తం ఇచ్చి నా ప్రాణం కాపాడవంటూ నిన్ను తనకి చూపిస్తానని కార్తీక్ అనుకుంటాడు.
మరొక వైపు అసలైన వారసురాలు నాకు తెలుసని దాస్ అంటాడు. చెప్పమని జ్యోత్స్న అనగానే.. ఎవరో కాదు కుబేర్ కూతురు దీప... కుబేర్ కి దీప దొరికిన కూతురు మాట ఎంత బలమైందో చూడు.. కాంచన తన కోడలిని తన ఇంటికి కొడలిని చేసుకుంటా అంది.. అలాగే చేసుకుంది చూసావా అని దాస్ అనగానే జ్యోత్స్న షాక్ అవుతుంది. ఈ విషయం ఎలాగైనా అన్నయ్య, వదినలకి చెప్తానని దాస్ అనగానే.. వద్దు నాన్న అంటూ జ్యోత్స్న రిక్వెస్ట్ చేస్తుంది. కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడితుంది. లేదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది. నా అంతటా నేను నిజం చెప్పను.. అలా అని దీపకి అన్యాయం చెయ్యనని దాస్ వెళ్ళిపోతాడు. నిజం చెప్పనన్నాడు. అన్యాయం చెయ్యను అనడం ఏంటని జ్యోత్స్న అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read