
మా బోనాల జాతర లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజయ్యింది. ఈ ఎపిసోడ్ లో సగం వరకు నిరంజన్ - అమూల్య పెళ్ళికి సంబంధించిన కాన్సెప్ట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక నిరంజన్ వచ్చి తనకు కాబోయే భార్య అమూల్యకి సంబంధించిన డీటెయిల్స్ సర్ప్రైజెస్ ని రివీల్ చేసాడు. అలాగే వెరైటీగా ప్రొపోజ్ కూడా చేసాడు.
"ఇది నా రాజకుమారి కథ. నీ కథ అంటే మన కథ. నా రాజకుమారి పుట్టిన టైం 1995 జనవరి 8 మధ్యాహ్నం 2.30 కి . నా చిట్టి తల్లి అమూల్య చిన్నప్పటి పిక్స్ ఇవి. చాలా క్యూట్ గా ఉంది కదా. ఇప్పుడు ఇంకా క్యూట్ ఉంది " అని చెప్తూ ఆమెను కొత్తగా పరిచయం చేసాడు. ఆ తర్వాత పంచదార బొమ్మ సాంగ్ కి ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. "నేను ఫస్ట్ టైం అమూల్య గారి ఫేస్ చూడలేదు. కాళ్ళు చూసాను. నా లైఫ్ లో కాళ్ళు అంత తెల్లగా ఉంటాయని తెలీదు ఫారెనర్స్ కి తప్ప. ఆ రోజు అనుకున్నా ఈ కాళ్లకు ఏదో మిస్సయ్యిందే అని . ఏది మిస్సయ్యిందో అది ఈరోజు పెడుతున్నా " అంటూ ఆమె కాళ్లకు పట్టీలు తొడిగాడు.
"నేను 90 రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను. ప్రతీ రోజు ఆయన మార్నింగ్ నుంచి ఈవెనింగ్ వరకు ఎం చేశారు ఎక్కడికి వెళ్లారు ఎపిసోడ్స్ చూసినప్పుడు బాధ కలిగిందా హ్యాపీగా అనిపించిందా ఇలా ప్రతీ దాన్ని వీడియోస్ గా రికార్డు చేసారు " అని చెప్పింది అమూల్య. "పింపుల్ వచ్చే ఏజ్ నుంచి రింకిల్ వచ్చే ఏజ్ వరకు నేను నీతో ప్రతీ క్షణం ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పాడు నిరంజన్. అలాగే ముసలి వాళ్ళ గెటప్స్ వేసుకుని కర్ర పట్టుకుని నడిచి ఎంటర్టైన్ చేశారు. ఫిబ్రవరిలో ఆమె బర్త్ డే సెలబ్రేషన్ ఫోటో చూపించి అది తనకెంతో స్పెషల్ అని చెప్పాడు నిరంజన్. దాన్ని మరింత స్పెషల్ చేయడానికి ఒక డ్రోన్ తో ఎంగేజ్మెంట్ రింగ్ ని తెప్పించి ఆమె చేతికి పెట్టి విల్ యు మ్యారి మీ అంటూ అడిగాడు. ఇక అమూల్య ఎస్ అంటూ ఆన్సర్ ఇచ్చింది. శ్రీముఖి గట్టిగ్గా అరిచింది.






