
వరూధిని పరిణయం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి చందన శెట్టి ఇప్పుడు ఒక శుభవార్త చెప్పింది. గత నెల 26న తాను ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు రీసెంట్ గా సోషల్ మీడియాలో రివీల్ చేసింది. దాదాపు పది రోజుల తర్వాత ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. తన ఫాన్స్ తో ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్న తన కూతురికి సంబంధించిన ఒకటి రెండు ఫొటోలను కూడా షేర్ చేసింది.
కన్నడకు చెందిన చందన శెట్టి 2013లో ప్రసారమైన ‘వరూధిని పరిణయం’ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైంది. 2013 నుంచి 2016 వరకు ప్రసారమైన ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘దేవయాని’, ‘పవిత్ర బంధం’, ‘స్వర్ణా ప్యాలెస్’ వంటి సీరియల్స్ లో నటించింది. తమిళంలోనూ రెండు సీరియళ్లలో కనిపించింది.
తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో నటనకు కొంచెం బ్రేక్ ఇచ్చింది. 2024 ఏప్రిల్‌లో ఓ ఎన్నారైని వివాహం చేసుకున్న చందన ప్రస్తుతం భర్తతో కలిసి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేసింది..ఇక ఇప్పుడు తన బిడ్డ విషయాన్నీ కూడా బయటపెట్టింది.
అయితే చందన శెట్టికి నటనకు ముందు డబ్బింగ్ ఆర్టిస్టుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె తల్లి సరస్వతి కూడా డబ్బింగ్ ఆర్టిస్టే. తల్లి బాటలోనే చందన 2008 నుంచి 2012 మధ్య దాదాపు 45 సినిమాల్లో హీరోయిన్లకు గాత్రదానం చేసింది. ఆ తర్వాతే సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్వర్ణ పాలస్ అనే సీరియల్ కొద్దీ రోజులే ప్రసారం ఐనా కానీ అందులో ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.






