
బిగ్ బాస్ సీజన్ 10 త్వరలో పట్టాలెక్కబోతోంది. ముందుగా టెస్ట్ ఫైర్ రెడీ అవుతోంది. అగ్నిపరీక్ష టెలికాస్ట్ డేట్ కూడా వచ్చేసింది. ఇలాంటి బిగ్ బాస్ సందడి చేయబోతున్న సమయంలో గత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు సంబందించిన గత బిగ్ బాస్ పాత జ్ఞాపకాలను మళ్ళీ సోషల్ మీడియాలో ఆడియన్స్ తలుచుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సంజనా గల్రాని ఇమ్మానుయేల్ తో కలిసి ఉన్న ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ వైరల్ గా మారింది .
" కొన్ని బంధాలు రక్త సంబంధంతో ఏర్పడవు.. ప్రేమ, నమ్మకం, ఆప్యాయత, గౌరవంతో ఏర్పడతాయి. బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి రోజు నుంచి 105వ రోజు వరకు సంజన గల్రానీ, ఇమ్మానుయేల్ పంచుకున్న తల్లి-కొడుకు అనుబంధం ఎంతోమంది హృదయాలను తాకింది. ప్రతి సవాలులో ఒకరికొకరు అండగా నిలిచారు. ప్రతి విజయాన్ని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లో కూడా నిజమైన అనుబంధాలు ఏర్పడతాయని నిరూపించారు. షో ముగిసిన తర్వాత కూడా వారి బంధం బలపడుతూనే ఉంది. నిజమైన అనుబంధాలకు కాలం, దూరం అడ్డుకావని వారు మరోసారి గుర్తుచేస్తున్నారు.
బిగ్‌బాస్ హౌస్‌లో మొదలైన ఈ ప్రయాణం.. జీవితాంతం కొనసాగే బంధంగా మారింది."అంటూ ఆ పోస్ట్ లో రాసారు.
బిగ్ బాస్ 9 ఇమ్ము లేకుండా అసలు ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ అనేదే లేదు అన్నట్టుగా సాగింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు అమ్మ అంటూ ఇమ్ము పిలవడం సంజన కూడా తన కొడుకుల అతన్ని చూసుకుంటూ అతనికి సపోర్ట్ గా నిలబడడం ఆడియన్స్ అందరూ చూసారు. ఇన్ని సీజన్స్ లో ఒక తల్లి కొడుకుల బంధం బిగ్ బాస్ లో ఎవరూ ఊహించలేని అనుబంధం వీరిదే.






