నాకు హీరోగా చేసే ధైర్యం లేదు అన్న జానీ మాష్టర్
on Jun 6, 2023
జానీ మాష్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. 2009లో నితిన్ చేసిన ద్రోణ మూవీకి కొరియోగ్రాఫర్ గా ఛాన్స్ వచ్చింది. తర్వాత 2012లో రచ్చ మూవీకి కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. బన్నీ, రామ్ చరణ్, తారక్ లాంటి హీరోలతో స్టెప్పులేయించాడు. 2014లో సల్మాన్ ఖాన్ మూవీ "జయహో" కు జానీ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు. అలాంటి జానీ మాష్టర్ ఒక ఇంటర్వ్యూలో తాను హీరోగా చేయడం అనే విషయాల గురించి చెప్పాడు. "మిమ్మల్ని హీరోగా మూవీస్ తీయాలంటూ చాలామంది వెయిట్ చేస్తున్నారు కానీ మీరెందుకు లేట్ చేస్తున్నారు" అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు "సినిమా స్టార్ట్ చేద్దామని గెటప్ చేసుకుంటాను కరెక్ట్ గా అదే టైములో పెద్ద పెద్ద సాంగ్స్ కి కోరియోగ్రఫీ చేసే అవకాశాలు వస్తున్నాయి.
నేను ఆ సాంగ్స్ వదులుకుని హీరోగా చేసేంత ధైర్యం నా దగ్గర లేదు. నాకు ధైర్యం ఎందుకు లేదు అంటే ఐ లవ్ మై హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్..ఫస్ట్ ప్రిఫెరెన్స్ వాళ్ళకే...నేను ఖాళీగా ఉన్నప్పుడు హీరోగా చేస్తాను తప్ప వచ్చిన సాంగ్స్ ని వదిలేసి అదే పనిగా హీరోగా చేయడం అనేది నాకు ఇంటరెస్ట్ లేదు. ఎందుకంటే ఈరోజున నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది అంటే దానికి కారణంగా నా హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్..వీళ్లంతా ఉన్నారు కాబట్టే ఈరోజు జానీ మాస్టర్ అంటూ నన్ను గుర్తిస్తున్నారు. అలాంటి గుర్తింపు వచ్చిన కొరియోగ్రాఫర్ ప్లేస్ ని ఎలా వదిలేయాలి.. అలా వదిలేయకుండా ఉన్న గ్యాప్ లో సినిమా చేద్దామని ఉంది." అని చెప్పారు జానీ మాస్టర్ "మీ దగ్గరకు చాలా స్క్రిప్ట్స్ వచ్చాయని, కొన్ని సెలెక్ట్ కూడా చేసుకున్నారని తెలిసింది. ఇంతకు మీరు ఏ టైపు ఆఫ్ జానర్ లో హీరోగా రావాలనుకుంటున్నారు" అని అడిగిన ప్రశ్నకు "నేను హీరోగా కంటే కథ మాట్లాడాలి...డాన్సులు, ఫైట్లు కంటే కథ హీరోగా ఉంటే బాగుంటుంది" అని చెప్పాడు జానీ మాష్టర్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
