ENGLISH | TELUGU  
Home  » TV News

రిషి గదిలో రొమాంటిక్ సీన్.. వసుధారకి పట్టిన చెమటలు!

on Mar 18, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -713 లో.. ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ జరిపిస్తుంది దేవయాని. ఆ పూజలో జగతి, మహేంద్రలు కూర్చొని నిష్టగా చేస్తారు. రిషి, వసుధారల మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోవాలని ఇద్దరు కోరుకుంటారు. పూజ పూర్తయ్యాక దేవాయని వసుధార దగ్గరికి వచ్చి.. "ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో తెలిసిందా.. నువ్వు ఈ ఇంటికి ఒక అతిధిగా మాత్రమే వచ్చావ్. రిషికి నీపై ప్రేమ లేదు. ఉంటే ఇద్దరు కలిసి పూజలో కుర్చునేవాళ్ళు కదా.. నీకు నువ్వే తెలివైనదానివని అనుకుంటావ్ కదా.. సప్తసముద్రాలు ఈది చివరికి మురికి కుంటలో పడ్డట్టయింది నీ పరిస్థితి" అని అంటుంది. అలా తను మాట్లాడిన మాటలకు వసుధార నవ్వుతుంది. మీలాగే నేను చిటికె వెయ్యగలను. మీ పెద్దరికానికి గౌరవం ఇస్తున్నాను. రిషి సర్ నా గుండెల మీద ఉన్నాడు. ఎప్పుడు రిషి సర్ వెంటే నేనుంటానని వసుధార చెప్తుంది. ఇక తను అలా మాట్లాడేసరికి దేవయానికి కోపం వస్తుంది. 

ఆ తర్వాత రిషి సర్ ఇంకా లేవలేదా కాలేజీకి లేట్ అవుతుందని వసుధార తన రూమ్ ముందు వచ్చి చూస్తుంది. లోపలికి వెళ్ళాలా? వద్దా అని ఆలోచిస్తుండగా.. జగతి వచ్చి.. "ఏంటి వసుధార" అని అడుగగా.. రిషి సర్ ఇంకా లేవలేదు.. వెళ్ళి లేపాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అని వసుధార అంటుంది. రిషి రూమ్ లోకి వెళ్ళే స్వేచ్చ నీకు ఉంది.. వెళ్ళి లేపమని జగతి అనగానే.. వసుధార లోపలికి వెళ్తుంది. రిషిని అలానే చూస్తూ ఉండిపోతుంది వసుధార. కాసేపటికి రిషి లేచాక.. "గుడ్ మార్నింగ్ ఎండీ సర్" అని
వసుధార చెప్పగా, గుడ్ మార్నింగ్ వసుధార అని చెప్తాడు.  "నువ్వు ఏంటి ఇక్కడ ఉన్నావ్" అని రిషి అడుగుతాడు. వసుధారకి చాలా దగ్గరగా వచ్చి ముద్దిద్దామని అనుకుంటాడు. కానీ మళ్ళీ తన మెడలో తాళి వేసుకున్నది గుర్తు చేసుకొని దూరంగా వెళ్తాడు. ఆ తర్వాత తాను కాలేజీకి తొందరగా రెడీ అవుతానని చెప్పి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది.

మరోవైపు కిచెన్ లో వంట చేస్తున్న ధరణి దగ్గరికి వసుధార వెళ్ళి.. మీకేమైనా హెల్ప్ చెయ్యాలా మేడమ్ అని అడుగుతుంది. వద్దని ధరణి అంటుంది. నువ్వు అందరిని మేడం అని పిలవకు.. చిన్న అత్తయ్యా.. పెద్ద అత్తయ్య అని పిలువు అని ధరణి అనగానే.. రిషి సర్ నన్ను భార్యగా ఒప్పుకున్నాకే అలా పిలుస్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.