Home

»

Tv News

సుధీర్ బావ వీడియోస్ చూసి మూడ్ తెచ్చుకుంటా... పెళ్లిళ్లు కాలేదు.. గట్రాలు అయ్యాయి

Nov 9, 2026 5:18PM


అష్షు రెడ్డి అంటే చాలు ఫామిలీ స్టార్స్ లో బావ సుధీర్ ని ఏడిపిస్తూ వినోదం పంచే కొంటె పిల్లగా అందరికీ గుర్తొస్తుంది. అలాంటి అష్షు రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ . ఇక రీసెంట్ సుప్రీత్ పాడ్ క్యాస్ట్ షోకి ఫస్ట్ గెస్ట్ గా వచ్చింది.  " అక్కా ఏంటి సుధీర్ బావ గురించి చెప్పు.  మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని, పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి " అని  సుప్రిత అడిగింది. దీనికి అషురెడ్డి ‘ఓయమ్మ!’ అంటూ తనదైన రీతిలో స్పందించింది. ఇక ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అయితే ఏం చేస్తారని సుప్రిత అడిగింది. దానికి అషురెడ్డి.. ‘మూడ్ తెచ్చుకుంటాను.. మూడ్ తెచ్చుకుంటాను’ అంటూ సరదాగా చెప్పింది. "ఎలా మూడ్ తెచ్చుకుంటావని " అడగ్గా.. ‘మా బావ వీడియోలు చూసి మూడ్ తెచ్చుకుంటా’ అంటూ నవ్వించింది! ఆ తర్వాత హరితో తన స్నేహం గురించి ప్రశ్నించింది సుప్రిత. దీనికి అషురెడ్డి మాట్లాడుతూ.. హరి తనకు జెన్యూన్ ఫ్రెండ్ అని, అయితే ఇద్దరం చాలా తక్కువగా మాట్లాడుకుంటామని చెప్పింది. అంతేకాదు, హరికి బైక్ కొనిచ్చానని, కానీ ఆ బైక్‌పై తాను ఒక్కసారి కూడా ఎక్కలేదని చెప్పుకొచ్చింది. కనీసం ఒక్క రౌండ్ అయినా తిప్పరా.. బైక్ ఇచ్చినందుకు అని అడిగానని తెలిపింది.

దీనికి  సుప్రిత స్పందిస్తూ.. ‘మరి ఎవరిని ఎక్కించుకుని తిరుగుతున్నావో తెలియదు కానీ హరి!’ అంటూ కౌంటర్ వేసింది. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు! ఇక పెళ్లిళ్ల ప్రస్తావన కూడా వచ్చింది.  ‘అక్కా.. మీకు పెళ్లిళ్లు గట్రా చాలా అయ్యాయని అంటున్నారు’ అని సుప్రిత అడగ్గా.. ‘పెళ్లిళ్లు అవ్వలేదు కానీ గట్రాలు చాలా అయ్యాయి’ అంటూ అషురెడ్డి పంచ్ వేసింది! మరోవైపు తాను ఇంకో ఏడాదిన్నర మాత్రమే ఉంటానని అషురెడ్డి చెప్పడంతో.. అప్పుడే ఎందుకు? ఇంకా సింగిల్‌గానే ఉన్నావు కదా అని సుప్రిత అడిగింది. దీనికి అషురెడ్డి.. ‘ఎక్కడ ఉన్నావు నువ్వు సింగిల్‌గా? చెప్పు!’ అంటూ ఎదురు ప్రశ్న వేసింది. దీంతో మరోసారి నవ్వులు పూశాయి!

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com