డైరెక్టర్ సుకుతో రెండో పెళ్ళికి రెడీ అంటున్న జ్యోతి రాయ్!?
on Sep 29, 2023

ప్రస్తుతం టివి ట్రెండ్ నడుస్తోంది. టీవీ సీరియల్స్ బాగా పాపులర్ అయిపోతున్నాయి. ఇంతకుముందు సినిమా థియేటర్లకు ఫ్యామిలీ ఆడియన్స్ బాగా వచ్చేవారు. ఎప్పుడైతే ఉదయం నుంచి అర్థరాత్రి వరకు టీవీల్లో వరసగా సీరియల్స్ వస్తున్నాయో అప్పటి నుంచి థియటర్లకు లేడీ ఆడియన్స్ కరువయ్యారు. ఇప్పుడు టీవీ ఆర్టిస్టులకు లేడీ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. వారి పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కూడా పెరిగింది.
కన్నడ పరిశ్రమ నుంచి జ్యోతిరాయ్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 20కిపై సీరియల్స్‌లో నటించిన జ్యోతిరాయ్ ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతిగా తల్లి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె మళ్ళీ పెళ్ళి చేసుకోబోతోందన్న వార్త వైరల్‌గా మారింది. 20 ఏళ్ళ వయసులోనే పద్మనాభం అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్న 38 సంవత్సరాల జ్యోతి రాయ్ అతనితో కొన్నాళ్ళు కాపురం చేసింది. వారికి ఒక బాబు. కారణాలు తెలియవు కానీ అతనికి ఇప్పుడు దూరంగా ఉంటోంది జ్యోతి.
గత కొంతకాలంగా యంగ్ డైరెక్టర్ సుకు పుర్వాజ్‌ను జ్యోతి పెళ్ళి చేసుకోబోతోందని రూమర్లు వచ్చాయి. ఇద్దరూ రిలేషన్‌లో వున్నారని వారు పోస్ట్ చేస్తున్న ఫోటోల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ అన్నీ నిజమేనని తాజాగా పోస్ట్ చేసిన ఇద్దరి ఫోటోలు ప్రూవ్ చేస్తున్నాయి. క్యాప్షన్‌లో ఉంగరం గుర్తుతోపాటు లవ్ బర్డ్స్ ఎమోజీని కూడా పెట్టడంతో తమ ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్ జరిగిందని చెప్పకనే చెప్పినట్టయింది. అంతేకాదు, సీరియల్స్‌తోపాటు ఒక వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్న జ్యోతి తన పేరును జ్యోతి పుర్వాజ్ అని వేసుకోవడం కూడా వారిద్దరి రిలేషన్‌ని ప్రూవ్ చేస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్ళి చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



