Home

»

Tv News

సింహాద్రి మాటలపై జానూకు అనుమానం.. సూర్య లవ్ మ్యాటర్‌ను లీక్ చేసిన తుఫాన్!

Jun 14, 2026 10:17AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గోదావరి'(Godhavari). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -30 లో.....జానూ, మురళి కలిసి తోట గురించి మాట్లాడడానికి సింహాద్రి దగ్గరికి వెళ్తారు. నువ్వు ఎందుకు అబ్బయి వాళ్ళకి మాట ఇచ్చావ్.. అసలు ఆ తోట ప్రాబ్లమ్ లో ఉంది.. అసలు ఆ తోట డబ్బులు ఇంకా మీ నాన్న ఇవ్వలేదు.. ఈ విషయాలన్నీ మీకు చెప్పలేదా అని సింహాద్రి అంటాడు. పైగా చాలా చోట్ల అప్పులు చేసాడు.. డబ్బులు ఇవ్వకున్నా నా మాటతో రిజిస్ట్రేషన్ కి ఒప్పుకున్నారు కానీ ఆ తోట అమ్మిన అతను కోమాలో ఉన్నాడని సింహాద్రి చెప్తాడు. మా మావయ్య ఇవన్నీ మాతో చెప్పలేదని మురళి అంటాడు. శంకర్ తొందరపడి మాటిచ్చాడంటే నువ్వు కూడా  అలాగే చేసావని సింహాద్రి అంటాడు.

నేను చూసుకుంటా తోట గురించి అని సింహాద్రి అంటాడు. మీకెందుకు శ్రమ నేను చూసుకుంటా అంకుల్ అని జానూ అంటుంది. నేను చూసుకుంటా అని సింహాద్రి అంటాడు. రెండు రోజులు చూస్తాం.. ఆ తర్వాత మేం ఇన్వాల్వ్ అవుతామని మురళి అంటాడు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్లాక ఏంటి అండి తోట గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా ఇలా మాట్లాడుతున్నారని సింహాద్రి భార్య అంటుంది. నీకెందుకే అని సింహాద్రి తనపై కోప్పడతాడు. ఆ తర్వాత సూర్యపై భువన కోపంగా ఉంటుంది. ఎందుకు ఆ జానూతో తిరుగుతున్నావని కోప్పడుతుంది నువ్వు వాళ్ళింటికి వెళ్లి పరామర్శించవు కదా నేను కూడా జానూ దగ్గరికి వెళ్ళానని అంటాడు. వెళ్లడం అంటే దాన్ని ఎక్కుంచుకొని తిరగడమా అని భువని కోప్పడుతుంది. తనని బాబు గారు లవ్ చేస్తున్నారని తుఫాన్ అంటాడు. దాంతో భువన షాక్ అవుతుంది. ఇక సూర్య కవర్ చేస్తాడు. 

ఆ తర్వాత ఎందుకు సింహాద్రి అంకుల్ దగ్గరికి వెళ్లి తోట గురించి మాట్లాడావ్.. అంత పెద్ద దానివి అయ్యావా.. తోట గురించి ప్రాబ్లమ్ ఉన్నాయేమో మనం బాధపడుతామని మీ నాన్న చెప్పలేదేమో.. నువ్వు ఇంకొకసారి పట్టించుకోకని జానూపై శారద కోప్పడుతుంది. ఆ తర్వాత నిజంగా వెళ్లి మాట్లాడవా ఎందుకు సింహాద్రి అంకుల్ మీద డౌట్ వచ్చిందా అని జానూని నందు అడుగుతుంది. ఎందుకో నాకు డౌట్ గా ఉంది అక్క.. అతని మాటలు పొంతన లేకుండా ఉన్నాయని జానూ చెప్తుంది.‌ మరోవైపు కళ్యాణ్, గౌతమి కలిసి ఉండటం జాను చూస్తుంది. ఇక గౌతమిని కళ్యాణ్ తో ఉండడం చూసిన జానూ గౌతమిని ఇండైరెక్ట్ గా అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com