జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -294 లో..... శ్రీమంతానికి రమ్మని ఎందుకు నాన్నని బలవంతం చేస్తున్నావని సుధాతో నిషా అనగానే షట్ యువర్ మౌత్.. నువ్వు ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతున్నావని నిషాపై విశ్వ కోప్పడతాడు. ఇక సుధాతో విశ్వ మాట్లాడుతాడు. రెడీ అవ్వు వెళదామని విశ్వ అంటాడు. ఆ తర్వాత ప్రీతీని గంగ వాళ్ళు ముస్తాబు చేస్తారు. నా దిష్టి తగిలేలా ఉందని శకుంతల అంటుంది. ఆ తర్వాత నేను వెళ్లి గెస్ట్ లని రిసీవ్ చేసుకుంటా.. మీరు ప్రీతీని రెడీ చేసి తీసుకొని రండి అని శకుంతల అంటుంది. ఆ తర్వాత నువ్వే ఇంత అందంగా ఉన్నావంటే లోపల నా అల్లుడు ఇంకా ఎంత అందంగా ఉన్నాడోనని గంగ అంటుంది.
గంగ ప్లాన్ చేస్తున్నావ్ కదా ప్రీతీకి పుట్టబోయే బాబుకి నీ కూతురిని ఇవ్వాలని అనుకుంటున్నావు కదా.. నాకు అర్థం అయిందని ఇందుమతి అంటుంది. తను ఇవ్వడం ఏంటి గంగకి పాప పుడితే నేనే దాని చెవి మెలిపెట్టి మరీ.. నా కోడలిని చేసుకుంటానని ప్రీతీ అంటుంది. ఇషిక నువ్వు నెక్స్ట్ ఈ ఇయర్ వరకు శ్రీమంతం చేసుకోవాలి లేదంటే విడాకులు ఇస్తామని ఇందుమతి అనగానే కోపంగా ఇషిక అక్కడ నుంచి వెళ్తుంది. వీరు దగ్గరికి వెళ్లి అత్తయ్య ఇలా అంటున్నారు.. అందరు బెదిరించేవాళ్ళే అని చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటుంటే రుద్ర వచ్చి వాళ్ళతో సెటైరికల్ గా మాట్లాడతాడు. ఆ తర్వాత శ్రీమంతం కుర్చీని చూసి గంగ మురిసిపోతుంది. అప్పుడే రంగా వస్తాడు. నాకు అలా జరిగితే బాగుండు అనుకుంటుంది.. నన్ను మావయ్య అని ఎప్పుడు పిలుస్తారో అని రంగా అనుకుంటారు. అప్పుడే రుద్ర వచ్చి ఏం ఉహించుకుంటున్నారని అడుగుతాడు. నేను మావయ్యని ఎప్పుడు అవుతానోనని రంగా అనగానే గంగ ఛాంపియన్ అయ్యేవరకు ఏవి లేవని రుద్ర అంటాడు.ఆ తర్వాత ఇషిక కావాలనే సూర్యతో మీ అమ్మ ఇలా మాట్లాడింది. మీ అన్నయ్య అలా మాట్లాడాడని చెప్పి ఏడుస్తుంది. దాంతో రుద్ర అన్నయ్యని నేను అడుగుతానని సూర్య వెళ్తుంటాడు.
అవన్నీ విన్న రంగా, సూర్యని ఆపుతాడు. అప్పుడే గంగ వచ్చి వెళ్లనివ్వు అన్నయ్య.. తనకి రుద్ర సర్ చేసింది ఏదీ గుర్తులేదు. అసలు అయన ఒకరిని ఏమైనా అంటాడా.. భార్య మాటలు నమ్మి గొడవకి వెళ్తున్నాడని గంగ తన మాటలతో సూర్యని వెళ్లనీయకుండా ఆపుతుంది. ఆ తర్వాత ఇషిక దగ్గరకి సూర్య వెళ్ళి మాట్లాడతాడు. నువ్వు అందరితో కలిసి పనిచేస్తే నిన్ను ఎందుకు తిడుతారని ఇషికనే రివర్స్ అంటాడు సూర్య. ఆ తర్వాత విశ్వ. సుధా, నిషా శ్రీమంతానికి వస్తారు. చాలా థాంక్స్ అని సుధా చెప్తుంది. బహుశా మీ వాళ్ళని కలవడం ఇదే చివరిసారి అనుకుంటా.. ఎందుకంటే నువ్వు ఇక ఈ ఇంటికి ఎప్పుడు రానని మాటిచ్చావని సుధాకి గుర్తుచేస్తాడు విశ్వ. అక్కడ ఇల్లు చూసి అబ్బో పెద్ద బంగ్లానే అని నిషా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.




