Home

»

Tv News

జ్యోత్స్నకు సూరజ్ ఊహించని మైండ్ గేమ్.. అవుట్ హౌస్‌లోకి కొత్త ఎంట్రీ!

Jun 14, 2026 10:12AM

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2 ). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -696 లో...... దీపకి ఏదో ఆర్డర్ వచ్చిందని మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ఏంటో చూసి చెప్పమని మేనేజర్ ని అడుగుతుంది. నేను చెప్పింది మీరు నమ్మరు మేడమ్.. సూరజ్ గారు వచ్చాక చెప్పమని చెప్పండి అని మేనేజర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దీపకి కార్తీక్ చెప్పింది గుర్తుకువస్తుంది. ఇంగ్లీష్ లో ఉన్న మెయిల్ ని తెలుగు లో ట్రాన్స్ లేట్ చేస్తుంది. ఆ మెయిల్ చదువుతుంది ఏంటే తెలుగులో ట్రాన్స్ లేట్ చేస్తున్నావా.. ఫిఫ్త్ క్లాస్ అని జ్యోత్స్న అనగానే ఏంటే కల్తీ దాన అని దీప అంటుంది. నిన్న ఫుడ్ లో కల్తీ చేశావ్ కదా అని దీప అంటుంది.

ఇప్పుడంటే మెయిల్ ని ట్రాన్స్ లేట్ చేసి తెలుగులో చదివావ్ దానికి రిప్లై ఇవ్వాలి కదా అని జ్యోత్స్న అనగానే అప్పుడే కార్తీక్ వస్తాడు. తెలియని వాళ్ళకి చెప్పాలి కానీ ఇలా ఎగతాళి చెయ్యకూడదని కార్తీక్ అంటాడు. ఇప్పుడు దీనికి ఎవరు హెల్ప్ చేస్తారు. ఆ సూరజ్ గాడికి దెబ్బ తగిలింది.. వాడు రాడు అని జ్యోత్స్న అంటుంది అప్పుడే కాలికి గాయం ఉన్నా సరే సూరజ్ వస్తాడు. ఎందుకు వచ్చావ్ బ్రో రెస్ట్ తీసుకోవాలి కదా అని కార్తీక్ అంటాడు. అది నా పర్సనల్ బ్రో కానీ దీప గారికి హెల్ప్ చెయ్యడం నా ప్రొఫెషన్ అని సూరజ్ చెప్తాడు. నువ్వు మెయిల్స్ చూస్తూ ఉండమని దీప చెప్తుంది. ఆ తర్వాత కార్తీక్ , దీప ఇద్దరు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటారు. జ్యోత్స్న బయటకు వెళ్లి వచ్చేసరికి తన టేబుల్ పై ఒక పేపర్ మీద ఐ లవ్ యు అని రాసి ఉంటుంది. ఆ పేపర్ ని చూసి కోపంగా సూరజ్ దగ్గరికి జ్యోత్స్న వెళ్లి.. ఏంటి ఇది అని అడుగుతుంది. నాకేం తెలుసు నువ్వే చెప్పమని సూరజ్ అనగానే ఐ లవ్ యు అని జ్యోత్స్న అనగానే నాకు అలాంటివి అంటే ఇంట్రెస్ట్ లేదని సూరజ్ అంటాడు. నా టేబుల్ పై ఎందుకు పెట్టావని జ్యోత్స్న అడుగుతుంది. నువ్వు చూసావా అని సూరజ్ అంటాడు. అప్పుడే శివన్నారాయణ వస్తాడు. వెంటనే జ్యోత్స్న ఆ పేపర్ తీస్తుంది. చూసావా తాత ఏం రాశాడో అని జ్యోత్స్న ఆ పేపర్ చూపిస్తుంది. అందులో థాంక్స్ అని ఉంటుంది. నువ్వు థాంక్స్ చెప్పాలి.. తను చెప్పాడని కంప్లైంట్ ఇస్తున్నావా అని శివన్నారాయణ అంటాడు.

సూరజ్ ఆ పేపర్ ని మారుస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావ్ పెళ్లి అయిందా అని సూరజ్ ని శివన్నారాయణ అడుగుతాడు. దగ్గరలో రూమ్ చూస్తున్నాను. అప్పుడే మిమ్మల్ని చూసి సేవ్ చెయ్యడానికి వచ్చానని సూరజ్ అంటాడు. పెళ్లి కాలేదు అమ్మాయి దగ్గరగా ఉందని అనిపిస్తుందని సూరజ్ అనగానే జ్యోత్స్న కోపంగా చూస్తుంది. ఆ తర్వాత సూరజ్ ని కార్తీక్, శివన్నారాయణ ఇంటికి తీసుకొని వెళ్తాడు. సూరజ్ కి దెబ్బలు తాకే పరిస్థితి రావడానికి కారణం మనమే కాబట్టి కొన్ని రోజులు సూరజ్ ఇక్కడే ఉంటాడు. అవుట్ హౌస్ లో అని శివన్నారాయణ అనగానే.. వద్దని పారిజాతం అంటుంది. ముందు దీప అందులో ఉండి పెద్ద ప్రాబ్లమ్ లా అయింది.. ఇప్పుడు వీడు ఉంటే ఇంకెలా అవుతాడోనని కార్తీక్ తో పారిజాతం అంటుంది. సూరజ్ ఇక్కడే ఉంటాడని శివన్నారాణ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com