
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఏ దేవి వరమో నీవు'(Ye Devi Varamo Neevu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -14 లో.....అంజలి బస్సు ఎక్కి వెళ్ళిపోతుంది. తన వెనకాలే మనీష్ వేరొకరికి బైక్ ని లిఫ్ట్ అడిగి ఫాలో అవుతాడు. అప్పుడే రాజారాం తనకి ఫోన్ చేసి అంజలిని తీసుకొని వస్తున్నావా అని అడుగుతాడు. హా తీసుకొని వస్తున్నానని చెప్పి కట్ చేస్తాడు మనీష్. అంజలి మాత్రం మనీష్ ని తప్పించుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత మనీష్ కూడా బస్సు ఎక్కుతాడు. అంజలి తన అమ్మని గుర్తుచేసుకొని ఎమోషనల్ అవుతుంది.
మరొకవైపు గీతాంజలికి వెక్కిళ్లు వస్తాయి. ఎవరో నిన్ను గుర్తు చేసుకుంటున్నారనుకుంటా అని తన భర్త అంటాడు. నన్ను ఎవరు గుర్తు చేసుకుంటారు. స్ట్రిక్ట్ గా ఉంటా రూల్స్ అంటూ అందరికి చెప్తానని గీతాంజలి అనగానే నీ కూతుళ్లు గుర్తుచేసుకుంటారని భానుచందర్ అంటాడు. తల్లి ఎంత కఠినంగా ఉన్నా కూతుళ్లు గుర్తు చేసుకుంటారని భానుచందర్ చెప్తాడు. మరొకవైపు అంజలి వెనకాల సీటులోనే మనీష్ కూర్చొని ఉంటాడు. మనీష్ అందరితో కబుర్లు చెప్తుంటే అంజలి మాత్రం చిరాకుగా ఉంటుంది. మనీష్ కి తెలియకుండా అంజలి బస్సు దిగుతుంది. ఇక మనీష్ చూసేసరికి అంజలి కన్పించదు. ఇందాకే ఆ అమ్మాయి దిగిపోయిందని కండక్టర్ చెప్తాడు. దాంతో మనిష్ కూడా బస్సు దిగుతాడు.
అప్పుడే మళ్ళీ రాజారాం ఫోన్ చేసి హైదరాబాద్ వచ్చారా అని అడుగుతాడు. ఏం చెప్పాలో తెలియక వచ్చాము కానీ టైమ్ పడుతుందని మనీష్ చెప్తాడు. అంజలి మాత్రం మనీష్ ని చూసి తనకి కన్పించకుండా తప్పించుకుని వెళ్తుంది. తరువాయి భాగంలో రాజారాం ఇంటికి అంజలి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.





.webp)
