బిగ్ బాస్ సీజన్-10 పదకొండో వారం వీకెండ్ వచ్చేసింది. నిన్నటి శనివారం నాటి ఎపిసోడ్ లో..హోస్ట్ నాగార్జున డిక్టేటర్‌గా బ్లాక్ డ్రెస్‌లో వచ్చాడు. మొదటగా ఈవారం హౌస్‌కి కెప్టెన్ అయిన అమన్‌ని అభినందించారు. టికెట్ టు ఫినాలే కూడా గెలుచుకోవడంతో.. ఫస్ట్ కంటెస్టెంట్ అయినందుకు కంగ్రాట్స్ చెప్పాడు. ఆ తరువాత ముఖేష్ డిక్టేటర్‌గా ఎలా చేశాడో చర్చించుకుని అతనికి మార్క్స్ ఇవ్వమని ముఖేష్ టీమ్ సభ్యులకు చెప్పాడు నాగార్జున.
వర్షిణిని అడగాల్సిన పనేలేదు.. బాగోదని వందకి వంద ఇవ్వలేదు కానీ.. 90 మార్క్స్ అనేసింది. కానీ మిగిలిన వాళ్లు మాత్రం 50 కంటే ఎక్కువ మార్కులు ఇవ్వలేదు. రామ్ ప్రసాద్ అయితే 30 మార్కులే వేశాడు. సుధీర్ కూడా 30 మార్కులే వేశాడు. మిగిలిన నరేష్, నీతూ, రామకృష్ణలు.. 50 మార్కులు వేశారు. ఆ తరువాత ముఖేష్‌ని నిలబెట్టి.. నీ టీం నీకు ఇచ్చిన మార్కులు 50 మాత్రమే అని చెప్పాడు నాగార్జున.
ఆ తరువాత త్రిగుణ్ టీమ్ ని వెళ్లి చర్చించుకుని మార్కులు ఇవ్వమన్నాడు నాగార్జున. నోరు జారడం పక్కన పెడితే.. అందరు కలిసి నూటికి 90 మార్కులు ఇచ్చారు. డిక్టేటర్‌గా అద్భుతంగా చేశాడు సర్.. అతనికి నూటికి నూరు శాతం మార్కులు వేయాలి.. కానీ మధ్య మధ్యలో నోరు జారాడు అందుకే 90 మార్కులు అని శివ చెప్పాడు.ఆ తరువాత త్రిగుణ్ కి 90 మార్క్స్ ఇచ్చాడు నాగార్జున.. ఈ మార్క్స్ కి అతను అర్హుడేనా అని ముఖేష్ ని నాగార్జున అడుగగా.. లేదు సర్.. డిక్టేటర్‌గా ఒక గేమ్‌ని కావాలనే రద్దు చేయించాడు. నోరు జారాడు. చాలా చేశాడు కాబట్టి.. వాటికి అర్హుడు కాదు సర్ అని ముఖేష్ చెప్పాడు. ఆ తర్వాత బయట ఒక ఆడియన్ తో మాట్లాడించారు. ముఖేష్ 50 కూడా కరెక్ట్ కాదు.. 30 ఇవ్వాలని ఆ ఆడియన్ చెప్పారు. చివరికి డిక్టేటర్‌గా నువ్వు ఫెయిల్ అయ్యావని ముఖేష్ తో నాగార్జున చెప్పాడు.
[Bigg Boss 10 Telugu Weekend Episode Nagarjuna Dictator Marks, Mukesh Dictator Failed 50 Marks, Trigun Dictator 90 Marks Best Performance, Aman Ticket To Finale First Contestant, Bigg Boss 10 Telugu Week 11 Saturday Episode]




