బిగ్ బాస్ కంటే కూడా అదే తనకి ఎక్కువ ఇష్టమన్న గీతు రాయల్!
on May 22, 2023

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది.
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.
గీతు రాయల్ ఎలిమినేట్ అయ్యాక యూట్యూబ్ లో వ్లాగ్స్ చేస్తుంది. ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రతీ అప్డేడ్ ని తెలియజేస్తూ తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది. అయితే రీసెంట్ గా తను తన ఇన్ స్టాగ్రామ్ లో 'ఆస్క్ మీ క్వశ్చన్' అంటూ అభిమానులతో ముచ్చటించింది. అందులో తన అభిమానులు కొన్ని ఆసక్తిరమైన ప్రశ్నలు వేయగా వాటికి కూల్ గా సమాధానమిచ్చింది గీతు. మీరెందుకు ఈ మధ్య విజయ్ బాల్గనిన్ సాంగ్స్ పోస్ట్ చేస్తున్నారని విజయ్ అడుగగా..
ఈ పాట పాడిన మీరే ఈ ప్రశ్న వేయడం నాకు ఆనందంగా ఉంది.. మీ వాయిస్ బాగుంటుంది. మీరు పాడిన నాన్నా నాన్న సాంగ్ నా ఫేవరేట్. నా కాలర్ ట్యూన్ కూడా ఇదేనని చెప్పింది గీతు రాయల్. 'మీ లైఫ్ లో బిగ్ బాస్ కాకుండా ఎప్పటికి మర్చిపోలేనిది ఏంటి' అని ఒకరు అడుగగా.. 'How I got lied to, got cheated, got betrayed, got backstabbed, leftover, and still got over and stood strong at every stage of life " అని గీతు రాయల్ సమాధనమిచ్చింది. ఇలా గీతు తన ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికరమైన సమధానాలనిచ్చింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ లు ఇన్ స్టాగ్రామ్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



