Home

»

Tv News

Podharillu : కేశవ గురించి తెలుసుకొని మహా షాక్.. గాయత్రికి దుబాయ్ సంబంధం!

Mar 10, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -66 లో.... కేశవ ఏం చేస్తాడని కన్నాని మహా అడుగుతుంది. చెప్పడం ఎందుకు చూపిస్తానని కేశవ మెకానిక్ షాప్ దగ్గరికి కన్నా తీసుకొని వెళ్తాడు. కేశవ మెకానిక్ పనిచేస్తూ ఉంటాడు. అతన్ని చూసి మహా షాక్ అవుతుంది. మీ చక్రి అన్న మా కేశవకి పెద్ద ఆటో మొబైల్స్ షాప్ ఉందని అన్నాడని అంటుంది. అదంతా అబద్ధం అని కన్నా అంటాడు. ఆ తర్వాత మహాని చూసి కేశవ జ్యూస్ తెప్పించి తనకి ఇస్తాడు. ఆ తర్వాత చక్రి వచ్చేసరికి మహా కోపంగా ఉంటుంది. ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావని కోప్పడుతుంది.

అన్ని అబద్ధాలు అప్పుడే చెప్పాను.. ఇప్పుడు ఏం చెప్పలేదని చక్రి అంటాడు. ఇంకా నాకు ఏమైనా అబద్ధాలు చెప్పావని తెలియాలి.. అప్పుడు చెప్తానంటూ మహా వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత చక్రి,మహా రిసెప్షన్ ఫోటోని నారాయణ ఫ్రేమ్ కట్టించి తీసుకొని వస్తాడు. అది చూసి మహా షాక్ అవుతుంది. చక్రి మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకు ఇవ్వన్ని అని మాధవ అనగానే ఎందుకు అలా అంటున్నావని కేశవ అంటాడు. ఆ తర్వాత మహా, మాధవ మాట్లాడుకుంటారు. రాను రాను నన్ను ఈ ఇంటికి పర్మినెంట్ చేసేలా ఉన్నారు. త్వరగా ఇక్కడ నుండి వెళ్ళలని మహా అంటుంది. ఆ తర్వాత మాధవ దగ్గరికి కేశవ వచ్చి.. ఎందుకు అన్నయ్య ఇలా మారిపోయావు.. చక్రి, వదిన కలిసి ఉండడం నీకు ఇష్టం లేదా లేక నీ కంటే ముందు వాడికి పెళ్లి అయిందని అలా చేసున్నావా అని కేశవ అనగానే మాధవ బాధపడతాడు.

మరొకవైపు గాయత్రి వాళ్ళ నాన్న దుబాయ్ నుండి వస్తాడు. ఇంటికి టాక్సీ లో వస్తాడు. కార్ లో ఒక ఆవిడని చూసి నాకు సవతిని తీసుకొని వచ్చావని తాయారు కోప్పడుతుంది. సవతి కాదు ప్యాసింజెర్ అని అతను అంటాడు. నాన్న నాకేం గిఫ్ట్ తీసుకొని వచ్చావని గాయత్రి అడుగుతుంది. నీకొక మంచి సంబంధం తీసుకొని వచ్చాను. అబ్బాయి దుబాయ్ లో సెటిల్ అయ్యాడు. నీ ఫోటో చూపించాను పెళ్లిచూపులకి వస్తామన్నారని అతను చెప్పగానే తాయారు హ్యాపీగా ఫీల్ అవుతుంది. గాయత్రి బాధగా లోపలికి వెళ్తుంది. మరొకవైపు చక్రి హ్యాపీగా ఉండడంతో మళ్ళీ ఏం ఘణకార్యం చేసావని మాధవ అడుగుతాడు. అసలు నాన్న ఫోటో ఐడియా ఇచ్చిందే నేను అని చక్రి అంటాడు. అసలు ఇది తప్పు అనిపించడం లేదా అని చక్రిపై మాధవ కోప్పడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com