
జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -212 లో..... ఇందుమతి ఇంకా రంగా ఇద్దరు పోటీ పెట్టుకుంటారు. ఎవరు మిర్చి బజ్జిలు ఎక్కువ తింటారోనని అందరు చూస్తుండగా అందులో ఇందుమతి గెలుస్తుంది. ఇందుమతి తినడాన్ని చూసి రంగాకి మతిపోతుంది. మరొకవైపు జరిగింది గుర్తుచేసుకొని వీరు ఒంటరిగా ఉంటాడు. అక్కడికి ఇషిక వచ్చి అక్కడ ఫన్నీగా పోటీ జరుగుతుంది. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది.
ఆ ప్రమీల సూపర్ మార్కెట్ నుండి పరిగెత్తుకు వచ్చేలా ప్లాన్ చేసానని చెప్పావ్ ఏమైందని ఇషిక అడుగుతుంది. ప్లాన్ ఫెయిల్ అయిందని పట్టరాని కోపంతో వీరు ఉంటాడు. ఆ తర్వాత ప్రమీల రాత్రి ఇంటికి వస్తుంది. అందరు తన చుట్టూ చేరి ఫస్ట్ డే సూపర్ మార్కెట్ ఎలా ఉందని అడుగుతారు. ప్రమీల దగ్గర ఉండి అన్ని చూసుకుందని పెద్దసారు చెప్తాడు. ఈ సంతోషంలో పార్టీ చేసుకోవాలని వంశీ అంటాడు ఆల్రెడీ పార్టీ అరెంజ్ చేసానని పెద్దసారు అంటాడు. రేపు హోలీ ఈవెంట్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నామని పెద్ద సారు అనగానే అప్పుడే శకుంతల లోపలికి వెళ్లి గట్టిగా డోర్ వేసుకుంటుంది.
అత్తయ్య రాకుండా ఎలా అని ప్రమీల అంటుంది. మీ అత్తయ్యని తీసుకొచ్చే బాధ్యత నాది అని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత అందరు హోలీ ఈవెంట్ కి వెళ్తారు. పెద్దసారు కార్ దిగుతాడు. శకుంతల రాలేదని డిస్సపాయింట్ అవుతారు. అప్పుడే శకుంతల ఏంట్రీ ఇస్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దసారు శకుంతలని ఎలా ఒప్పించి తీసుకొని వచ్చాడో గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత గంగ, రుద్రకి మధ్య పోటీ నడుస్తుంది. ఒక్క చుక్క కలర్ అంటకుండా వెళ్ళాలి. అలా రుద్ర వెళ్తాడు. మీరు విన్ అవ్వలేదు అదిగో మీ ప్యాంటు కి కలర్ అని గంగ చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.







