
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -975 లో..... ఐశ్వర్య కాపీ కొడుతూ ఇన్విజిలేటర్ కి దొరికిపోతుంది. దాంతో అతను ఐశ్వర్య దగ్గరున్న ఆన్సర్ షీట్ తీసుకుంటాడు. నా ఫ్రెండ్స్ కూడా కాఫీ కొట్టారని తన ఫ్రెండ్స్ పేర్లు చెప్తుంది ఐశ్వర్య. దాంతో అందరి దగ్గర నుండి పేపర్స్ లాక్కొని వెళ్ళమంటాడు ఇన్విజిలేటర్. వెళ్తాము సర్ డబ్బు పెడితే పాస్ అయినట్లు సర్టిఫికెట్స్ ఇస్తారని ఐశ్వర్య తన ఫ్రెండ్స్ ని తీసుకొని పొగరుగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కావ్య ఎగ్జామ్ త్వరగా రాసి ఇంటికి వెళ్లాలని ఫాస్ట్ గా రాస్తుంది.
మరొక వైపు తన దగ్గర తీసుకున్న అప్పు చెల్లెంచమని భూషణ్ ని చక్రి అడుగుతాడు. లేదంటే నీ కంపెనీ షేర్ తీసుకుంటాను.. అలా అని సంతకం పెట్టమని చక్రి అంటుంటే మంచిపని చేస్తున్నావ్ అప్పులో ఉన్న కంపెనీ తీసుకుంటే ఉన్న అప్పు నువ్వే కట్టాలి అలా అయితే ఒకేనా అని చక్రితో రేఖ అంటుంది. వద్దని చక్రి అంటాడు. కొద్ది రోజుల్లో ఈ కంపెనీకి ఆస్తులకి నేనే ఓనర్ ని అని రేఖ అంటుంది. ఇందు ఉండగా మీరు ఎలా అవుతారని చక్రి అంటాడు. మీకు అవన్నీ ఎందుకు.. నేను చెప్పింది నమ్మండి.. అప్పుడు నా కంపెనీలో వాటా ఇస్తాను. అప్పుడు వాటా ఇవ్వాలంటే ఇప్పుడు మీరు రెండు కోట్లు ఇన్వెస్ట్ చెయ్యాలని రేఖ చెప్తుంది. దానికి అతను సరే అని రెండు కోట్లు ఇస్తాడు. ఆ తర్వాత రేఖ, భూషణ్ ఇంటికి వెళ్తుంటే ఇందు కన్పిస్తుంది. ఇది నా మాట కాదని ఇంట్లో నుండి ఎందుకు బయటకు వచ్చిందని రేఖ కోప్పడుతుంది.
ఆ తర్వాత రేఖ ఇంటికి వచ్చి కోపంగా ఉంటుంది. అప్పుడే ఇందు వస్తుంది. ఎక్కడికి వెళ్ళావ్ నాకు బయట కన్పించావని అడుగుతుంది. స్వాతి డ్రెస్ స్టిచ్చింగ్ చేసుకొని రమ్మంది అని కావ్య చెప్పగానే స్టిచ్చింగ్ వాళ్ళ నెంబర్ ఇవ్వమని రేఖ అడుగుతుంది. తరువాయి భాగం లో సుభాష్ కి ఆపరేషన్ చెయ్యాలని డాక్టర్ చెప్తాడు. అందుకు పదిహేను లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్తాడు. దాంతో రేఖ దగ్గరికి ఇందు వెళ్లి తాతయ్య ఆపరేషన్ కి డబ్బు కావాలి ఇవ్వమని అడుగుతుంది. లేవని రేఖ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






