Home

»

Tv News

Jayam serial : వీరు కాళ్ళమీద పడి సారీ చెప్పిన గంగ.. వాడి మాటలు రుద్ర విన్నాడా!

Feb 20, 2026

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -198 లో..... గంగని చంపడానికి వీరు ప్లాన్ చేసి మోటార్ వైర్ తీస్తాడు. అది గంగ వెళ్లి ముట్టుకుంటుంది. దాంతో గంగకి షాక్ వస్తుంది. అప్పుడే రుద్ర వచ్చి గంగని కాపాడుతాడు. అందరూ హాల్లో ఉంటారు. ఈ పని చేసి నన్ను చంపాలని చూసింది వీరు అని గంగ అనగానే అందరు షాక్ అవుతారు. ఏం మాట్లాడుతున్నావని రుద్ర కోప్పడుతాడు. నేను చెప్పేది నిజమని గంగ చెప్తుంది. మోటార్ వైర్ తీసింది ఎవరో సీసీటీవీ చూడాలని అనుకుంటారు. సీసీటీవీలో ఏం ఉండదు. సీసీటీవీ లో లేకుండా చేసింది వీరునే. అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి గంగ ఎందుకు ప్రతీసారి నన్ను ఇలా అంటావ్.. నేను ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదా నేను ఇంట్లో ఉండొద్దని చెప్పే అధికారం కోడలుగా నీకుందని వీరు యాక్టింగ్ చేస్తాడు.

అవును ఇంట్లో ఉంటేనే ఇవన్నీ మేం ఇంట్లో ఉండమని ప్రీతీ ఏడుస్తుంటే వద్దని శకుంతల అంటుంది. నువ్వు ముందు వీరుకి సారీ చెప్పమని రుద్ర అంటాడు. నేను చెప్పను.. నేను తప్పు చెయ్యలేదు సారీ చెప్పనని గంగ అనగానే అందరు షాక్ అవుతారు. మీకు ఎవరికి తెలియదు ఈ వీరు మంచివాడు కాదని గంగ అంటుంటే..  గంగపై గట్టిగా అరుస్తాడు పెద్దసారు. అయిన వినకుండా గంగ అలాగే మాట్లాడుతుంటే రుద్ర తన చెంపచెల్లుమనిపిస్తాడు.. నేను తప్పు చెయ్యలేదు క్షమాపణ చెప్పనని గంగ అంటుంది. అలా అయితే నువ్వు ఇంట్లో అవసరం లేదని రుద్ర అంటాడు.

ఆ మాటకి వీరు, ఇషిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగ సారీ చెప్పకపోవడంతో గంగని కార్ ఎక్కించుకొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు రుద్ర. తరువాయి భాగంలో గంగ అమ్మనాన్న వచ్చి వీరు కాళ్ళు మొక్కుతుంటే.. వద్దు నేను చేసిన దానికి మీరేందుకు సారీ చెప్తారు.. నేనే చెప్తానని వీరు కాళ్లపై పడి గంగ క్షమాపణ అడుగుతుంది. ఆ తర్వాత ఇంకొకసారి నా జోలికి వస్తే ఈ ఇంట్లో ఉండనివ్వనని గంగతో వీరు అంటుంటే రుద్ర వింటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com