
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-54 లో.. ఉదయం అందరికి టిఫిన్ చేస్తుంటాడు మాధవ. అప్పుడే చక్రి అక్కడికి వస్తాడు. అతడిని దోసె తిరిగేయమని మాధవ చెప్పగానే అది తిప్పుతుండగా గాల్లోకి ఎగిరి పైన పడుతుంది. అది చూసి మాధవ కోప్పడతాడు. మీకు పనులు చెప్పమని మహా అంటుంది. కానీ పాపం తనకేం తెలుసు. మీకు పనులు చెప్తే ఇలా డబుల్ పని చేస్తారని అని మాధవ అంటాడు. అప్పుడే మహా వస్తుంది. రెండు నిమిషాల్లో నీకు దోసె తీసుకొస్తానని మాధవ అనగానే అది కాదు పెద్ది నాకొక హెల్ప్ చేయాలని మహా అడుగుతుంది. ఏంటి రూమ్ కదా నేను చూస్తాను.. కానీ సేఫ్టీ గా ఉండాలని వెతుకుతున్నానని మాధవ అనగానే దానితో పాటు ఉద్యోగం కూడా కావాలి. నా లక్ష్యం నేను చేరుకోవాలి. ఎన్నిరోజులు మీ ఇంట్లో ఉండాలంటూ మహా అంటుంది. దాంతో సరే అమ్మ అని మాధవ అంటాడు.
ఇక ఇంట్లో వాళ్ళంతా పనులకి వెళ్తారు. మహా ఒక్కతే ఉండగా అప్పుడే నారాయణ మందుతో ఎంట్రీ ఇస్తాడు. అదే సమయంలో ఇంట్లో కరెంట్ పోతుంది. క్యాండిల్ కోసం వెతుకుతుంటే లైటర్ కావాలా అని నారాయణ అడుగుతాడు. వద్దని గ్యాస్ అన్ చేసి దీపం వెలిగిస్తుంది మహా. ఇక నారాయణ తన గతం మొత్తం చెప్తాడు. అది కాసేపు విని మహాకి బోర్ కొట్టి బయటకు వచ్చేస్తుంది. ఇక అప్పుడే చక్రి, కన్నా ఇద్దరు బైక్ పై వస్తుంటారు. ఏం అయింది బయట ఉన్నారని చక్రి అడుగగా కరెంట్ పోయిందని మహా అంటుంది . కరెంట్ పోతే క్యాండిల్ వెలిగించాలి కానీ ఇలా బయటకొచ్చి నిలబడతారా? దేనికో భయపడ్డారని చక్రి అడుగుతాడు. ఇక నారాయణ ఇంట్లోకి వచ్చి తాగాడాని ఇబ్బందిగా అనిపించి వచ్చానని మహా అంటుంది. ఇక ముగ్గురు వెళ్తారు. చక్రి, కన్నా ఇద్దరు కలిసి నారాయణని తిడతారు. మహా ఇద్దరిని ఆపి లోపలికి వెళ్ళమంటుంది. కాసేపటికి హారికకి మహా ఫోన్ చేస్తుంది. నాకు సర్టిఫికేట్లు కావాలని మహా చెప్తుంది. ఎందుకని హారిక అడుగగా.. నేను జాబ్ తెచ్చుకొని హాస్టల్ కి వెళ్దామని అనుకుంటున్నాను. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు.. ఈ ఇంట్లో వాళ్ళెవరు నన్ను ఇబ్బంది పెట్టడం లేదని మహా అంటుంది. అదే విషయం మహా వాళ్ళ అమ్మకి హారిక చెప్పగానే తను ఎమోషనల్ అవుతుంది. తనకి ఆ ఇంట్లో లేకపోతే హాస్టల్ కి వెళ్తుందా ఇంటికి రాదా.. నేను ఆయనని అడుగుతానంటూ హారికతో మహా వాళ్ళ అమ్మ అంటుంది.
మరోవైపు అబద్దాలు ఎందుకు చెప్పావంటూ చక్రిని మాధవ, కేశవ తిడతారు. ప్రతాప్, ఆదిల దగ్గరికి మహా వాళ్ళ అమ్మ లలిత, హారిక వస్తారు. హారికకి మహా ఫోన్ చేసిందంట అని లలిత చెప్తుంది. తన ఫోన్ లిఫ్ట్ చేయవద్దని చెప్పాను కదా అని ఆది కోప్పడతాడు. తను ఫోన్ లిఫ్ట్ చేయడం వల్లే మహా ఆ ఇంట్లో ఉండలేకపోతుందని లలిత అంటుంది. దాని ప్రస్తావన రావొద్దని చెప్పాను కదా అని ప్రతాప్ అనగానే నా కూతురు ఈ ఇంట్లోనే ఉంటుంది. తనని ఈ ఇంట్లోకి రానివ్వకపోతే నేను ప్రాణాలతో ఉండనని చెప్పి లలిత వెళ్ళిపోతుంది. మరోవైపు చక్రి, మహా ఇద్దరు మాట్లాడుకుంటుండగా మాధవ మేన మరదలు గాయత్రీ వస్తుంది. ఏంటి విషయం అని వచ్చి గాయత్రీ మాట్లాడగా మహా సింపుల్ గా మాట్లాడుతుంది. ఇక తను కిచెన్ లోకి వెళ్ళి మాధవ వంటలు టేస్ట్ చేస్తుంటే ఎవరు తను అని చక్రిని మహా అడుగుతుంది. తను మా మేనత్త కూతరు గాయత్రీ.. తనకి మాధవ అన్నయ్య అంటే ఇష్టం.. తననే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుందని మహాతో చక్రి చెప్పగానే మరి ఏంటి ప్రాబ్లమ్ అని మహా అంటుంది. మా అత్తయ్య వాళ్ళు ఆస్తులన్నీ కోల్పోయి అప్పుల పాలయ్యారు. మా ఇంటి మీద కేసు వేసారని అంతా మహాతో చక్రి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






.webp)

