Home

»

Tv News

Karthika Deepam2: జ్యోత్స్న తన కన్నకూతురు కాదనే నిజాన్ని దశరథ్ కి చెప్పేసిన కార్తీక్!

Feb 20, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం-2 (Karthika Deepam2 )'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-598 లో.‌. దశరథ్, కార్తీక్ ఇద్దరు కలిసి ఒక దగ్గర మాట్లాడుకుంటారు. నేను రిపోర్ట్స్ గురించి ఆరాతీయకుండా ఉండి ఉంటే మీరు నా భార్యని చంపేద్దామని అనుకున్నారా అని కార్తీక్ ని దశరథ్  అడుగుతాడు. అత్తకేం కాదు మామయ్య అనగానే ఎలారా చెప్పు అని దశరథ్ అడుగుతాడు. కార్తీక్ చెప్పేది నిజమే మామయ్య అంటు దాస్ వస్తాడు. జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు.. కానీ కార్తీక్ ఉండగా వదిన ప్రాణాలకి ఏ హాని లేదని దాస్ అనగానే అదే ఎలాగా అని దశరథ్ అడుగుతాడు. ఎన్నిసార్లు చేసినా జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ అవ్వవు అన్నయ్య అని దాస్ అనగానే ఎందుకని దశరథ్ అడుగుతాడు. ఎందుకంటే జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు అన్నయ్య అని దాస్ అంటాడు. దాంతో దశరథ్ షాక్ అవుతాడు. 

జ్యోత్స్న నీ కన్నకూతురు కాదు మామయ్య అని కార్తీక్ అనగానే అదెలాగా నా కూతురిని నేనే మొదటగా ఎత్తుకున్నా అని దశరథ్ అంటాడు. వర్షం పడ్డాక ఏం జరిగిందో మీకు తెలుసు.. కానీ ఈ కథ వర్షంలోనే మొదలైంది. అత్త ప్రసవం తర్వాత బిడ్డల్ని మార్చారు.. పరాయి వాళ్ళ బిడ్డని తీసుకొచ్చి మీ బిడ్డ స్థానంలో ఉంచి , మీ బిడ్డని పరాయి వాళ్ళు తీసుకెళ్ళారని కార్తీక్ చెప్తాడు. నేను నమ్మలేకపోతున్నాను.. నేను ఇంకా షాక్ లోనే ఉన్నానంటూ దశరథ్ అనగానే నిజమే అన్నయ్య అని దాస్ అంటాడు‌. బిడ్డల్ని మార్చే అవసరం ఎవరికి ఉంది అని దశరథ్ అనగానే పారిజాతం మార్చిందని కార్తీక్ అంటాడు. ఎందుకని దశరథ్ అడుగగా మొదటిది శివన్నారాయణ మీద కోపంతో, రెండోది తన స్వార్థం అని కార్తీక్ అంటాడు. అంటే జ్యోత్స్న ఎవరి కూతురు అని దశరథ్ అడుగగా నా కూతరు అని దాస్ అంటాడు. అందుకే జ్యోత్స్న ఏం చేసినా పారిజాతంకి ఇష్టమే అని కార్తీక్ జరిగినవన్నింటి గురించి చెప్తాడు. మరోవైపు స్వప్న టిఫిన్ చేస్తుంటే కావేరి, శ్రీధర్ ఎంట్రీ ఇస్తారు.  అప్పుడే కాశీని పిలుస్తాడు శ్రీధర్. ఇక స్వప్న టిఫిన్ చేయకుండా లేచి వెళ్ళిపోతుంటే ఇదే నీ వీక్ నెస్ అంటు రివర్స్ లో మాట్లాడతాడు శ్రీధర్. ఇది కొత్త స్ట్రాటజీనా అని స్వప్న అనగానే పాతదే.. అతను వచ్చిన ప్రతీసారీ ఇలాగే మధ్యలో నుండి వెళ్ళిపోతావా అంటాడు. అయిన ఒక డ్రైవర్ కి టిఫిన్ సర్వ్ చేయవా అని శ్రీధర్ అనగానే కాశీకి టిఫిన్ పెడుతుంది స్వప్న .

ఇక కార్తీక్, దాస్ లని ఇద్దరిని దశరథ్ తిడతాడు‌. మీకు నిజం తెలిసి ఇన్నిరోజులు నన్ను మోసం చేశారంటూ దశరథ్ తిడుతుంటే కార్తీక్ నచ్చజెప్తాడు. మరి నా కూతురు ఎవరు? ఎక్కడుందని దశరథ్ అడుగగా కొన్ని చూపిస్తూనే బాగుంటుందని కార్తీక్ చెప్తాడు. మరోవైపు ఈ ఇంటివారసురాలు నా మనవరాలు జ్యోత్స్న అనుకొని ముసలోడిని , దశరథ్ ని గెంటేసి ఈ ఇంట్లో ఒక పెద్ద ఊయల చేపించుకొని ఊగుదామనుకున్నా అంటూ అంతా తిరుగుతుంటే చూసుకోకుండా శివన్నారాయణకి డాష్ ఇస్తుంది. ఏం అయిందని అడగగా వేదాంతాం మాట్లాడుతుంది పారిజాతం. ఇక అప్పుడే శ్రీధర్, కాశీ ఎంట్రీ ఇస్తారు‌. మీ నాన్న కనపడటం లేదని భాదపడకురా.. తొందరలోనే వస్తాడంటూ కాశీతో పారిజాతం అంటుంది. నాకెందుకు బాధ అని కాశీ అనగానే నాన్న కనపడకపోతే బాధ ఉండదారా అని పారిజాతం అనగానే కలిసాను.. మాట్లాడాను అని కాశీ అంటాడు. దాంతో దాస్ క్షేమంగా ఉన్నాడని పారిజాతం రిలీఫ్ అవుతుంది. మరోవైపు తన కూతురు ఎక్కడుందో చూపించమని దశరథ్ అడుగగా కార్తీక్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com