అమ్మ ఎంట్రీతో ఫైమాకి ఆనందం.. కీర్తి భట్ కన్నీటి పర్యంతం!
on Nov 24, 2022
బిగ్ బాస్ హౌస్ లో గత రెండు రోజులుగా సాగుతున్న 'ఫ్యామిలీ వీక్' ఎపిసోడ్స్ వరుసగా హిట్ అవుతూ, వీక్షకుల మనసును గెలుచుకుంటున్నాయి. అయితే నిన్న జరిగిన ఎపిసోడ్లో ఫైమా వాళ్ళ అమ్మ వచ్చింది.
దాంతో ఫైమా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మకి హౌస్ అంతా చూపించి, తన ఆట ఎలా ఉంది అని అడిగి తెలుసుకుంది. తనకి అమ్మ చాలా జాగ్రత్తలే చెప్పింది. "హౌస్ మేట్స్ తో జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది. "ఎవిక్షన్ ఫ్రీ పాస్ నువ్వే వాడుకో..ఎవరికి ఇవ్వకు. సత్యతో జాగ్రత్తగా ఉండు..నీ ముందు ఒకలా, నీ వెనుక ఒకలా మాట్లాడుతుంది. నామినేషన్స్ లో చూసి మాట్లాడు. ఎటకారం తగ్గించుకో, కోపం తగ్గించుకో.. నీకొచ్చిన పాస్ ని నువ్వే వాడుకో" అని సలహాలు ఇచ్చింది.
ఆ తర్వాత గార్డెన్ ఏరియాకి వచ్చి డాన్స్ చేసారు. అమ్మని ఫైమా ఎత్తుకొని డ్యాన్స్ చేయగా, కీర్తి భట్ భావోద్వేగానికి లోనైంది. తను ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇది చూసి శ్రీసత్య "మా మమ్మీ కూడా నడుస్తుంటే బాగుండేది" అని ఏడ్చింది. ఆ తర్వాత హౌస్ నుండి వెళ్ళిపోమని బిగ్ బాస్ చెప్పాడు. అమ్మ అందరికి బై చెప్పేసి వెళ్లిపోయింది. "థాంక్స్ బిగ్ బాస్. మా అమ్మను ఈ హౌస్ లో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది.. లవ్ యూ బిగ్ బాస్" అని ఫైమా సంబరపడింది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
