Home

»

Tv News

Bigg Boss 10 Telugu:ఝాన్సీ వర్సెస్ దేబ్జానీ.. ముఖేష్ టార్గెట్‌పై సుధీర్ ఎమోషనల్!

Nov 17, 2026 9:21AM

బిగ్ బాస్ సీజన్-10 లో పదకొండో వారం నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హీటెడ్ ఆర్గుమెంట్స్ తో సాగింది. ఎలిమినేషన్ అయి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్ లోకి వచ్చి నామినేషన్ చేయడం ఎపిసోడ్ కే హైలైట్ గా నిలిచింది.

షాలినీ, అపూర్వ, దక్షి వచ్చి నామినేషన్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత సింగర్ ఝాన్సీ వచ్చి దేబ్జానీని నామినేట్ చేసింది. అవసరానికి తగ్గట్టు వరసలు మార్చుతున్నావ్.. ఉమెన్ కార్డ్ వాడుతున్నావ్.. నీ పర్సనాలిటీ ఏమీ కనిపించడం లేదు.. నీ గేమ్ ఏం లేదని ఝాన్సీ చెప్తుంది.  నేను అలా చేసి ఉంటే నేను హౌస్ లో నువ్వు బయట ఉండేవాళ్ళం కాదని దేబ్జానీ అంటుంది. నీ గేమ్ ఏం లేదు.. అయినా ఇన్నివారాలు ఎలా ఉంటున్నావో అర్థం కావడం లేదని ఝాన్సీ అనగానే అది ఆడియన్స్ కి తెలుసని దేబ్జానీ అంది. ఆ తర్వాత ఝాన్సీ తన డాగర్‌ని ముఖేష్ కి ఇస్తుంది. జిరాఫీలా తిరగడం తప్ప. ఏం ఆట ఆడటం లేదని సుధీర్ ని ముఖేష్ అంటాడు ముకేష్. నువ్వు గ్రాటిట్యూడ్ చూపించడం లేదు అన్నా అని ఝాన్సీ కూడా సుధీర్‌ని అంటుంది. ముఖేష్ నామినేషన్‌లో విసుగు చెందిన సుధీర్.. తప్పు నాదే అయితే.. నేను వెళ్లడానికి సిద్ధమని అంటాడు. ఈ వారం నామినేషన్స్‌లో మాజీ కంటెస్టెంట్లు కేవలం నామినేట్ చేయడానికే రాలేదు.. లోపల ఉన్నవాళ్ల అసలు ముఖాలను బయటపెట్టడానికి వచ్చారన్నట్టుగా మాట్లాడారు. షాలినీ, దక్షి, మిథిలేష్, ఝాన్సీ, అపూర్వ ఇలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కో కంటెస్టెంట్‌పై సంచలన ఆరోపణలు చేయడంతో హౌస్‌లో టెన్షన్ పీక్‌కు చేరింది. ముఖ్యంగా దేబ్జానీపై ఝాన్సీ చేసిన ఉమెన్ కార్డ్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దేబ్జానీకి సపోర్ట్ చేస్తున్న ఫ్యాన్స్ ఒకవైపు, ఝాన్సీ చెప్పిందే కరెక్ట్ అంటూ మరోవైపు ఫ్యాన్స్ వాదనలు చేస్తున్నారు.

మరోవైపు ముకేష్‌కు వచ్చిన డాగర్ కూడా హౌస్‌లో పెద్ద గొడవకు కారణమైంది. సుధీర్‌తో తనకు ఉన్న గొడవను ముకేష్ మళ్ళీ తెరపైకి తీసుకురావడంతో సుధీర్ తీవ్రంగా ఎమోషనల్ అయ్యాడు. "నా తప్పు ఉంటే నేను వెళ్లిపోవడానికి రెడీ" అని సుధీర్ అనడంతో హౌస్‌లో ఒక్కసారిగా సైలెన్స్ వచ్చేసింది. త్రిగుణ్, శివ్, వంశీ, నీతూ, ముకేష్, సుధీర్, దేబ్జానీ ఇలా దాదాపు అందరూ నామినేషన్స్‌లో ఉండటంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? అనే టాక్ కూడా వినిపిస్తోంది. అసలు బిగ్ బాస్ ఈ వారం ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com