Home

»

Tv News

ముసుగులో వచ్చిన ఆ మిస్టరీ సౌందర్య లహరి ఎవరు!

Jun 2, 2026 3:16PM

డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా వచ్చేసింది. ఐతే ఈ ప్రోమోలో చాలా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. నాగార్జున సోగ్గాడు గెటప్ లో అనిల్ రావిపూడి వచ్చారు. నెక్స్ట్ వీక్ థీమ్ ఏంటంటే 90 స్ గోల్డెన్ కంబినేషన్స్ నోస్టాల్జియా అన్నమాట. అందుకే అనిల్ రావిపూడి , రోజా గెటప్స్ మార్చేశారు. "డ్రామా జూనియర్స్ ఇప్పటి దాకా ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క " అన్నాడు సుధీర్. సోగ్గాడే చిన్ని నాయనా మూవీలో నాగార్జున వేసుకున్న పంచె కట్టు చేతిలో కర్రతో వచ్చాడు అనిల్ రావిపూడి ఇక సుధీర్ ఆయన గెటప్ చూసి "హీరో నాగార్జున అంటే నమ్మేస్తారు " అనేసరికి "వాసివాడి తస్సాదియ్యా" అంటూ పెద్ద డైలాగ్ చెప్పారు .

ఇక రోజా రెడ్ కలర్ శారీలో వచ్చి "నా మాటే నా శాసనం " అంటూ శివగామిలా ప్రతిజ్ఞ చేశారు. ఇదంతా ఒక పక్కన మరో పక్కన వడ్డే నవీన్, రాశి, లయ కూడా వచ్చారు. వాళ్లందరినీ చూసేసరికి జడ్జ్ శ్రీకాంత్ లో ఫుల్ జోష్ వచ్చి దూసుకెళ్లారు స్టేజి మీదకు. ఇక తర్వాత శ్రీకాంత్ సౌందర్య లహరి దేవకన్యలా స్టేజి మీదకు వచ్చింది ఐతే ఆమె ఎవరు ఏంటి అనేది తెలీదు. ఎందులకంటే పెళ్లి సందడి మూవీలో సాంగ్ "సౌందర్య లహరి " పాటకు డాన్స్ చేస్తూ వచ్చింది. ఐతే ఆమె కళ్ళు తప్ప ఏమీ రివీల్ చేయలేదు. ఐతే అవి విష్ణు ప్రియా కళ్ళు అని కొందరు, కొందరు దీపికా పిల్లి అని కొందరు వర్షిణి అనుకుంటా అంటున్నారు.

ఐతే ఇంత మంది ఆనాటి సినీ సెలబ్రిటీస్ వచ్చారు కాబట్టి పెళ్లి సందడి మూవీలోని శ్రీకాంత్ హీరోయిన్ దీప్తి భట్నాగర్ కూడా కావొచ్చేమో అని కూడా కొందరు ఊహిస్తున్నారు. విష్ణు ప్రియా ఇప్పుడు ఎక్కువశాతం సుధీర్ తో కో - హోస్ట్ గా చేస్తోంది. సర్కార్ సీజన్ లో లాస్ట్ కొన్ని ఎపిసోడ్స్ కి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ షోకి కూడా సుధీర్ కి జోడీగా తీసుకొచ్చారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com