.webp)
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్ రియాలిటీ షో చాలామందిలో మార్పు తెచ్చినట్టే కనిపిస్తోంది. ఆల్రెడీ నటరాజ్ మాష్టర్ - నీతూ జోడిలో చాలా మార్పులు వచ్చాయి . ఇక ఇప్పుడు వాసంతి కృష్ణన్ - పవన్ కళ్యాణ్ జోడిలో కూడా మార్పులు వచ్చినట్టే కనిపిస్తోంది. దానికి ఉదాహరణగా వాసంతి ఒక వీడియోని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. లవ్ మాన్షన్ లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జిమ్ కి చాలా టైం స్పెండ్ చేస్తాడు కానీ కనీసం పూజకు పూలు తెమ్మంటే తేడు...పైగా లేవు అన్ని షాప్స్ మూసేసి ఉన్నాయి అంటాడు అంటూ ఫీలై కన్నీళ్లు కూడా పెట్టుకుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో చాలా మార్పులొచ్చాయి. పవన్ కళ్యాణ్ జిమ్ కి వెళ్లి వర్కౌట్ చేసి తర్వాత ఇంటికి వచ్చాడు. అది కూడా మాములుగా రాలేదు. "మారిపోయారు సర్ పూజకు పూలు తెచ్చారు పాలు తెచ్చారు.
.webp)
మార్పు మంచిదే సర్. మారిపోయారు సర్ మీరు " అని వాసంతి అనేసరికి "మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నన్ను మార్చేసింది . నీ కోసం వాళ్ళ కోసం ఇదంతా..మార్పు కావాలని అడిగావు గా " అని చెప్పాడు పవన్ కళ్యాణ్. " థాంక్యూ సో మచ్ . పాపం ఇవన్నీ తేవడానికి నడుచుకుని వెళ్ళాడు. వెరీ గుడ్ బాయ్ " అంటూ పాపం వాపోయింది వాసంతి . మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో చాలామంది కపుల్స్ వాళ్ళ వాళ్ళ పార్టనర్స్ ఎం చేస్తారు ఎం చేయరు ఎప్పుడు కోప్పడతారు ఏంటి అనే విషయాలను షేర్ చేసుకున్నారు. దాంతో వీకెండ్ లో వచ్చే జడ్జెస్ వలన అలాగే మిగతా కపుల్స్ ని చూసి వీళ్ళు చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళు ఆచరిస్తున్నట్టు ఈ వీడియోస్ ని చూస్తే తెలుస్తుంది.




.webp)
