Home

»

Tv News

మాకు వేరే పని లేదనుకుంటున్నావా..ఏం మాట్లాడుతున్నావ్ అసలు.!

Aug 12, 2026 3:06PM

బుల్లితెరపై ఇప్పటికే   క్రేజ్ సొంతం చేసుకున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’.   9 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో  10 వ  సీజన్‌లోకి అడుగుపెట్టబోతోంది. అయితే బిగ్ బాస్ సీజన్ 10కు ముందే కామన్ కేటగిరీలో సామాన్యులను ఎంపిక చేసే ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2’ సందడి మొదలు కానుంది.

స్మాల్ స్క్రీన్‌పై మరోసారి సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’ సిద్ధమైంది. ఈ షోకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో రిలీజయి  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగస్టు 15 నుంచి ఈ రియాలిటీ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తం   70 మంది ‘అగ్ని వారియర్స్’ తమ టాలెంట్ ని  ప్రదర్శించి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేందుకు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్ జడ్జీలుగా కనిపించగా.. శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఒక్కో కంటెస్టెంట్ టాలెంట్‌ను పరిశీలిస్తూ జడ్జీలు ఇంటరెస్టింగ్ ప్రశ్నలు వేస్తూ వాళ్ళ నుంచి ఆన్సర్స్ రాబడుతున్నారు.

అయితే కొంతమంది కంటెస్టెంట్లు ఏకంగా జడ్జీలకే కౌంటర్లు ఇచ్చేసరికి లేటెస్ట్ గా రిలీజయిన  ప్రోమో  ఆసక్తికరంగా మారింది. ఓ కంటెస్టెంట్ రూల్స్‌ను అతిక్రమించినట్లు తెలుసుకున్న శ్రీముఖి అతడిపై సీరియస్ అయింది. ‘‘మమ్మల్నే మోసం చేస్తావా? జ్యూరీని తప్పుదారి పట్టిస్తావా?’’ అంటూ ప్రశ్నించింది. ఇంకో కంటెస్టెంట్ వచ్చి "ఒరేయ్ మీరుండాలి నేనుండాలి...ఈ షో హిట్ అవ్వాలి " అనేసరికి ఇది చూసి మిమ్మల్ని సెలెక్ట్ చేయాలా అని అడిగింది. "అవును " అన్నాడు ఆ కంటెస్టెంట్. "జోక్స్ ఐపోయిని నవ్వకండి ఇది ఇంకా సీరియస్ మ్యాటర్ " అని నవదీప్ కూడా సీరియస్ గా చెప్పాడు.

మరో కంటెస్టెంట్ అయితే ఏకంగా అభిజిత్‌కే కౌంటర్ ఇచ్చాడు. "బిగ్ బాస్ షో తర్వాత అభిజిత్ రెండు, మూడేళ్లు ఎక్కడా కనపడలేదు " అని  కామెంట్ చేశాడు. దీంతో అభిజిత్ సీరియస్ అయ్యాడు. ‘‘మాకు వేరే పని లేదని అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావ్ అసలు?’’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.

 ఇక ప్రోమో చివర్లో ఓ కుర్ర కంటెస్టెంట్ మరోసారి అభిజిత్‌ను టార్గెట్ చేశాడు. బిగ్ బాస్ టైటిల్ గెలిచిన తర్వాత రెండేళ్ల పాటు ఎక్కడా కనిపించలేదంటూ కామెంట్ చేశాడు. దీంతో అభిజిత్ ఒక్కసారిగా హర్ట్ అయినట్లు కనిపించింది.
‘‘ఏం మాట్లాడుతున్నావు.. మాకేం పనిలేదనుకున్నావా?’’ అంటూ అభిజిత్ సీరియస్‌గా రియాక్ట్ అవ్వడం ప్రోమోలో హైలైట్‌గా నిలిచింది. "నిన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడం కుదరదు " అంటూ రెడ్ ఫ్లేమ్ ఇచ్చాడు.  దీంతో ఈసారి అగ్నిపరీక్షలో కంటెస్టెంట్లు టాలెంట్‌తో పాటు జడ్జీలకు ఇచ్చే కౌంటర్లు కూడా మంచి రసవత్తరంగా సాగబోతున్నాయన్న విషయం తెలుస్తోంది.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com