Home

»

Tv News

అగ్నిపరీక్ష సీజన్ 2లో ఆ 15 మంది.. ఆదిరెడ్డి హింట్స్‌తో మరింత ఆసక్తి

Aug 12, 2026 3:20PM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈసారి కూడా కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించిన ప్రాసెస్  దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆగస్టు 15 నుంచి ఈ షో ప్రారంభం కాబోతోంది. ఐతే  ఈసారి అగ్నిపరీక్షకు భారీగా పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. వేలాది అప్లికేషన్ల నుంచి తొలుత 70 మందిని ఎంపిక చేసి ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు . వారిలోంచి  చివరకు 15 మందిని సెలెక్ట్ చేసినట్లు telustondi. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. అగ్నిపరీక్ష సీజన్ 2లో కనిపించబోయే 15 మంది పేర్లు ఇవేనంటూ ఓ లిస్ట్ వైరల్ అవుతోంది. రాజకుమారి డయానా,  షాలిని పటేల్,  ఆర్జే చరణ్,  మిథిలేష్,  శ్రష్ఠి వ్యాకర్ని,  అమన్,  హేమంత్,  నవరసాలు ఆర్కే,  భాగీ తుళ్లూరి,  దీపక్,  రోహిత్,  యాంకర్ ప్రియా,  సింగర్ ఝాన్సీ,  గాయత్రి,  మిస్ అపూర్వ.  అయితే ఈ లిస్ట్‌పై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. ఐతే బిగ్ బాస్ న్యూస్ అప్ డేట్స్ ప్రకారం రివీల్ అవుతున్న కంటెస్టెంట్స్ మాత్రమే.  

ఆదిరెడ్డి హింట్స్‌తో మరింత ఆసక్తి

మరోవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, రివ్యూయర్ ఆదిరెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ ద్వారా అగ్నిపరీక్ష సీజన్ 2కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తన ఇన్స్టాగ్రామ్  స్టేటస్ ద్వారా రివీల్ చేస్తున్నాడు  . అగ్నిపరీక్ష సీజన్ 2లోకి బిగ్ బాస్ సీజన్ 9లోని కామన్ కంటెస్టెంట్లు కూడా రానున్నారని ఆయన హింట్ ఇచ్చారు . అయితే అందరూ ఒకేసారి కనిపించకుండా.. ఒక్కొక్కరు ఒక్కో ఎపిసోడ్‌లో కనిపించే అవకాశం ఉందని సూచించినట్లు తెలుస్తోంది.

ఇక కళ్యాణ్ పడాల, కళ్యాణ్, మనీష్ వంటి వారు అగ్నిపరీక్ష కంటెస్టెంట్లకు టాస్కులు పెట్టినట్లు కూడా ఆదిరెడ్డి వెల్లడించినట్లు సమాచారం. దీంతో ఈసారి అగ్నిపరీక్షలో కేవలం సెలక్షన్ ప్రక్రియ మాత్రమే కాకుండా.. టాస్కులు, గేమ్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతుందనే ఆసక్తి పెరిగింది. అలాగే భాగీ అనే కంటెస్టెంట్ చాలా ఫన్నీగా ఉందంటూ ఆదిరెడ్డి ఇచ్చిన హింట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఈ 15 మందిలో ఎవరు బిగ్ బాస్ సీజన్ 10లోకి వెళ్తారు? ఎవరు తమ టాలెంట్ తో గేమ్స్ ఆడి ఫన్ చేసి ఆడియన్స్ ని మెప్పిస్తారు? అనే ఆసక్తి మొదలైంది.

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 10కు ముందు ‘అగ్నిపరీక్ష 2’తో కామన్ కంటెస్టెంట్ల వేట మొదలుకానుంది. ఆ 15 మంది ప్రయాణం ఎలా ఉండబోతుంది.. చివరకు బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టేది ఎవరు అనేది తెలియాలంటే షో  కోసం వెయిట్ చేయాల్సిందే.
 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com