Home

»

Tv News

Jayam serial : విశ్వ ఎంట్రీతో షాక్ తిన్న శకుంతల.. పెళ్లిపై సంచలన నిర్ణయం!

Aug 12, 2026 11:14AM

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్  జయం  Jayam . ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్  344 లో....జయ తన ఇంటికి కోడలుగా వెళ్లడం మా వదినకి ఇష్టం లేదని విశ్వకి సుధా చెప్తుంది. దాంతో విశ్వ కోపంగా విజయంద్ర ప్రతాప్ ఇంటికి వెళ్తాడు. గుమ్మం బయట నిల్చొని లోపలికి రాను పెళ్లి జరుగుతుందో లేదో కనుక్కొని వెళ్తానని అందరిని బయటకు పిలుస్తాడు విశ్వ. శకుంతల దేవి గారు జయని ఇంటి కొడలు చేసుకోవడం ఇష్టం లేదని చెప్పిందట అని విశ్వ అనగానే అవును అన్నయ్య వదిన నాతో చెప్పిందని సుధా అంటుంది.

ఇష్టం లేకుండా నా కూతురిని మీ ఇంటికి కోడలు చెయ్యలేనని సుధా అంటుంది. ఇప్పుడే శకుంతల గారిని పిల్వండి తను చెప్పే సమాధానం పైన ఆధారపడి ఉంటుందని విశ్వ అంటాడు‌. మావయ్య ఏదైనా ఉంటే లోపలికి వెళ్లి మాట్లాడుకుందామని రుద్ర తనని లోపలకి తీసుకొని వెళ్తాడు. మరొకవైపు ఇప్పటివరకు నా ప్రేమ కోపం చూసారు కానీ ఇప్పుడు మైండ్ గేమ్ చూస్తారని శకుంతల తన మనసులో అనుకుంటుంది అప్పుడే గంగ వచ్చి విశ్వ సర్ వాళ్ళు వచ్చారని చెప్తుంది. దాంతో శకుంతల హాల్లోకి వెళ్తుంది. ఈ పెళ్లి ఇష్టమా కాదా అని విశ్వ అడుగుతాడు. ఇష్టమే అని శకుంతల అనగానే గంగ, రుద్ర షాక్ అవుతారు. నిన్న కోపం లో అలా అన్నాను కానీ ఈ కోపాలు ఎన్ని రోజులు ఈ పెళ్లి నాకు ఇష్టమే జయనే మా ఇంటికి కోడలు అని శకుంతల చెప్పగానే పెద్దసారు హ్యాపీగా ఫీల్ అవుతాడు.

గంగ స్వీట్ చేసి తీసుకొని రా అని శకుంతల అంటుంది. గంగ కిచెన్ లోకి వెళ్లి అసలు ఎందుకు ఈవిడ ఇలా చేస్తున్నారని అనుకుంటుంది. అప్పుడే రంగా వస్తాడు‌. గంగ ఏదో ఐడియా వచ్చి స్వీట్ పట్టుకొని హాల్లోకి వెళ్తుంది. ముందు జాతకాలు చూపించాకే ముహూర్తం పెట్టుకోండి అని గంగ అనగానే అవును అసలు ఆ విషయం మర్చిపోయామని పెద్దసారు అంటాడు. తరువాయి భాగంలో గంగని శకుంతల తిడుతుంది. అవమానిస్తుంది. దాంతో గంగ కోపంతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుంది. నన్ను తక్కువగా చూసే వాళ్లకి నా గెలుపుతో సమాధానం చెప్తానని రుద్రతో గంగ చెప్తుంది. ఆ మాటలు శకుంతల వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com