Home

»

Tv News

దేవుడు పంపిన కొత్త ప్రపోజల్ ఇదే.. ఎస్ చెప్పేసిన గుప్పెడంత మనసు లేడీ విలన్

Nov 18, 2026 1:34PM

రసజ్ఞ రీతూ అంటే బుల్లితెర మీద పెద్దగా ఎవరికీ తెలీదు. కానీ గుప్పెడంత మనసు  సీరియల్ లో  కనిపించి  తర్వాత  మాయమైపోయింది. మజిలీ అనే సీరియల్ తో పరిచయమైనా ఈ నటి తర్వాత నా పేరు మీనాక్షి, ఆడదే ఆధారం వంటి సీరియల్స్ లో నటించింది. ఇక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ విషయానికి వస్తే మహానటి, నాటకం, కథనం, రౌడీ బేబీ వంటి షార్ట్ ఫిలిమ్స్ లో అలా లవ్ బర్డ్స్ , రొమాంటిక్ గర్ల్ ఫ్రెండ్, ఖుషి వంటి సిరీస్ లో నటించింది. ఇక రసజ్ఞ రీతూకి గతంలో ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అది ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి బ్రేకప్ అయ్యింది.  ఆ తర్వాత కొన్నాళ్ళు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా కనిపించలేదు. ఇక ఇప్పుడు ఒక ఇంటరెస్టింగ్ పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది.
 
నేను ‘ఎస్ ’ అని చెప్పాను! నిజం చెప్పాలంటే, అంతా చాలా అందంగా, మనసుకు నచ్చినట్టుగా జరిగిపోయింది. మనం మన జీవితంలో ఎన్నో ప్లాన్స్ చేసుకుంటాం, ఎన్నో కలలు కంటాం. కానీ చివరికి దేవుడు మన కోసం ఏం రాసి పెట్టాడో అదే జరుగుతుంది. నా కోసం ఆయన ఇంత అందమైన క్షణాన్ని సిద్ధం చేశారని అసలు ఊహించలేదు. ఇది కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే కాదు.. దేవుడు సరైన సమయంలో మన జీవితంలోకి సరైన వ్యక్తిని పంపిస్తాడని మరోసారి గుర్తుచేసిన క్షణం. ఇకపై ప్రేమతో, ఆనందంతో నిండిన కొత్త ప్రయాణం మొదలవుతోంది. జీవితాంతం తోడుగా ఉండే ఈ బంధాన్ని ఇచ్చిన దేవుడికి ఎప్పటికీ కృతజ్ఞురాలిని!

రక్షా గౌడ ఐతే కంగ్రాట్యులేషన్స్ అని మెసేజ్ ఇచ్చింది. అలాగే అనుమిత దత్త, అన్షు రెడ్డి, గంగులీ , యాట నవీన, శ్రీవాణి, ప్రియాంక నాయుడు విషెస్ చెప్పారు. ఇక అన్షు రెడ్డి ఐతే మీ పెళ్లి ఫోటోలు ఎప్పుడు పోస్ట్ చేస్తారు చూడడానికి వెయిట్ చేస్తున్నాం అని కామెంట్ చేసింది. ఇక రసజ్ఞ రీతూ కూడా అందరికీ రిప్లైస్ ఇచ్చింది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com